iDreamPost

అందంగా కనిపిస్తున్న ఈ నర్సు మనిషి కాదు! ఏకంగా 7 మందిని..!

  • Author singhj Published - 04:19 PM, Sat - 19 August 23
  • Author singhj Published - 04:19 PM, Sat - 19 August 23
అందంగా కనిపిస్తున్న ఈ నర్సు మనిషి కాదు! ఏకంగా 7 మందిని..!

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఈమె మనిషి కాదు.. నరరూప రాక్షసి అంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. ఈ అందమైన నర్సు ఏకంగా ఏడు మంది ప్రాణాలను బలిగొంది. ఈ నరహంతకురాలి పేరు లూసీ లెబ్టీ (33). ఆస్పత్రిలో పుట్టిన శిశువులను కన్నతల్లిలా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన లూసీ.. ఆ పిల్లల పాలిట మృత్యువుగా మారింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు శిశువులను ఆమె పొట్టనపెట్టుకుంది. ఈ దారణమైన ఘటన ఇంగ్లండ్​లోని నియోనాటల్ యూనిట్​లో 2015-16ల మధ్య జరిగింది. లూసీ చంపిన వారిలో ఐదుగురు మగశిశువులతో పాటు ఇద్దరు ఆడశిశువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నియోనాటల్ యూనిట్​లో శిశువుల మరణంపై మాంచెస్టర్ టౌన్ కోర్టులో 10 నెలల పాటు విచారణ జరిగింది. లూసీ లెబ్టీ ఆయా పిల్లలకు పాలు, నీళ్లు బలవంతంగా ఇవ్వడం, అలాగే ఇన్సులిన్, గాలితో నిండిన ఇంజక్షన్లను ఇవ్వడం వల్లే వారి ప్రాణాలు పోయాయని ప్రాసిక్యూషన్ వాదించింది. అంతేగాకుండా పసిపిల్లలను చంపేముందు రకరకాలుగా వారిని హింస పెట్టిందని కోర్టుకు నివేదించింది. దీనికి ఆమె రాసిన పలు నోట్​లను ఆధారాలుగా సమర్పించింది. ‘అవును, వారిని నేను చంపా. ఆ శిశువులను సంరక్షించడానికి నేను సరిపోను’ అని రాసి ఉన్న లూసీ ఇంట్లోని నోట్​ను పోలీసులు గుర్తించారు. తాను భయంకరమైన వ్యక్తినని, సాతానునని.. ఈ ఘోరానికి పాల్పడింది తానేనని రాసి ఉన్న నోట్​లూ దొరికాయి.

ఇకపోతే, పుట్టినప్పుడే పలు సమస్యలతో బాధపడుతున్న శిశువులను ఉంచే వార్డులో లూసీ లెబ్టీ పనిచేసేది. అయితే వాళ్ల మధ్యనే ఓ క్రూరమృగం తిరుగుతోందని ఆ ఆస్పత్రి సిబ్బంది ఊహించలేదని సీనియర్ న్యాయవాది పాస్కలే జోన్స్ పేర్కొన్నారు. ఈ కేసులో లూసీకి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఎలాంటి కారణం లేకుండా వరుస మరణాలు చోటుచేసుకుంటుండటంతో అక్కడి డాక్టర్లకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్లు మరింత లోతుగా పరిశీలించారు. శిశువులు మరణించిన ప్రతి సందర్భంలోనూ నర్సు లూసీ మీద వారి దృష్టి పడింది. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లూసీ ఇంటిని చూడగా.. విస్తుబోయే విషయాలు తెలిశాయి.

లూసీ లెబ్టీ చంపాలనుకున్న ప్రతి శిశువు వైద్య నివేదికలు ఆమె రాసిపెట్టుకొని ఉంది. అంతేగాక ఆ శిశువు పేరెంట్స్ వివరాలు, వారి స్థితిగతులను కూడా సేకరించింది. వీటిని పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే విచారణ జరిగిన ఇన్నేళ్లలో లూసీ ఏనాడూ తన తప్పును ఒప్పుకోలేదు. కోర్టులో దోషిగా తేలిన అనంతరం కూడా తాను 14 రోజుల్లో సాక్ష్యాధారాలు సమర్పిస్తానని తెలిపింది. లూసీ కేసులో ఆమెకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పిన వారిలో భారత సంతతికి చెందిన డాక్టర్ జయరామ్ ఒకరు. ఈయన ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసిపిల్లలకు ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నా.. ఆమె అలాగే చూస్తూ ఉండేదని, ఏ చర్యా తీసుకునేది కాదని ఆయన కోర్టుకు వెల్లడించారు. లూసీ బారిన పడకపోతే ఆ శిశువులు ఇప్పుడు స్కూళ్లకు వెళ్లేవారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి