iDreamPost

రేపు ఫైనల్ లో కోహ్లీ డకౌట్ కావాలని కోరుకుంటున్న టీమిండియా అభిమానూలు! కారణం?

  • Published Jun 28, 2024 | 2:21 PMUpdated Jun 28, 2024 | 2:21 PM

Virat Kohli, Rohit Sharma, T20 World Cup 2024: సౌతాఫ్రికాతో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అవ్వాలని కొంతమంది కోరుకుంటున్నారు. మరి వాళ్లు అలా ఎందుకు కోరుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, Rohit Sharma, T20 World Cup 2024: సౌతాఫ్రికాతో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అవ్వాలని కొంతమంది కోరుకుంటున్నారు. మరి వాళ్లు అలా ఎందుకు కోరుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 28, 2024 | 2:21 PMUpdated Jun 28, 2024 | 2:21 PM
రేపు ఫైనల్ లో కోహ్లీ డకౌట్  కావాలని కోరుకుంటున్న టీమిండియా అభిమానూలు! కారణం?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అవ్వాలి. ఈ మాట విని చాలా మంది అభిమానులు.. అలా అంటున్న వారికి అసలు కొంచెమైన బుద్ధి ఉందా? అని అనుకుంటారేమో. కానీ, కొంతమంది క్రికెట్‌ అభిమానులు అలా ఎందుకు కోరుకుంటున్నారో తెలిస్తే.. మాత్రం. వారి కోరికలో కొంత న్యాయం ఉందని అనిపించక మానదు. క్రికెట్‌లో చాలా సెంటిమెంట్స్‌ ఉంటాయి. ఆటగాళ్లకే కాదు.. క్రికెట్‌ అభిమానులు కూడా సెంటిమెంట్స్‌ను బలంగా నమ్ముతూ.. ఇలా జరిగితే విజయం తమ జట్టుదే అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలవాలంటే.. ఫైనల్‌లో కోహ్లీ డకౌట్‌ అవ్వాలని కోరుకుంటున్నారు. అలా ఎందుకు కోరుకుంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

విరాట్‌ కోహ్లీ.. టీమిండియాకు పెద్ద దిక్కు. అతను ఛేజింగ్‌లో నిలబడితే ఎంత పెద్ద స్కోర్‌ అయినా చిన్నబోవాల్సిందే, ఎంత గొప్ప బౌలర్‌ అయినా తలొంచాల్సిందే. అలాంటి బ్యాటర్‌ డకౌట్‌ అయితే ప్రస్తుతం టీమిండియా మంచి జరుగుతుందనే సెంటిమెంట్‌ క్రికెట్‌ అభిమానుల నుంచి వినిపిస్తోంది. కోహ్లీ డకౌట్‌ అయిన చాలా సందర్భాల్లో రోహిత్‌ శర్మ పెద్ద పెద్ద స్కోర్లు చేశాడు. భారీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అయిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు చూస్తే.. టీ20ల్లో 121, 97, 92, 72.. అలాగే వన్డేల్లో 209, 159, 114, 87, 86, 78, 52.. టెస్టుల్లో 161, 62 పరుగులు చేశాడు. ఇందులోనే ఈ వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్‌ 8 మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్‌ అయితే.. రోహిత్‌ 92 పరుగులతో చెలరేగాడు.

పైగా.. ఈ మెగా టోర్నీలో కోహ్లీ ఎలాగో పెద్దగా ఫామ్‌లో లేడు, మరోవైపు రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఫైనల్‌లో కూడా రోహిత్‌ శర్మ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే టీమిండియాకు భారీ స్కోర్‌ గ్యారెంటీ. అందుకోసమే.. కోహ్లీ డకౌట్‌ కావాలని కొంతమంది క్రికెట్‌ అభిమానులు సరదాగా సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.. కోహ్లీ లాంటి మ్యాచ్‌ విన్నర్‌ త్వరగా అవుటైన చోటు రోహిత్‌ శర్మ బాధ్యత తీసుకుని బాగా ఆడుతున్నాడు.. అలాగే చాలా మ్యాచ్‌ల్లో రోహిత్‌ విఫలమైన చోటు కోహ్లీ బాగా ఆడాడు. ఇలా ఒకరు విఫలమైనా మరొకరు బాగా ఆడుతూ.. మొత్తంగా దేశాన్ని గెలిపిస్తున్నారు. అయితే.. ఇద్దరు బ్యాట్‌ ఝుళిపిస్తే మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై పిడుగు పడ్డట్టే. ఆ పిడుగును ఫైనల్‌ మ్యాచ్‌లో చూడాలని కూడా మరికొంత మంది అభిమానులు కోరుకుంటున్నారు. మరి కోహ్లీ డకౌట్‌ అయితే రోహిత్‌ అదరగొడతాడు అని కొంతమంది సరదాగా పేర్కొంటున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి