iDreamPost

సీఎం జగన్ తో టెక్ మహీంద్ర CEO భేటీ.. APలో పెట్టుబడులు!

సీఎం జగన్ తో టెక్ మహీంద్ర CEO భేటీ.. APలో పెట్టుబడులు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి పరిపాలనలో తనదైన మార్క్ ను చూపించారు. సంక్షేమ, అభివృద్ధి రెండిటిని జోడెద్దులా పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా ఏపీకి టెక్ మహింద్రా శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో విశాఖపట్నంతో సహా మూడు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించేందుకు మహీంద్ర సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు.

గురువారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని కలిశారు. సీఎంతో సమావేశమైన గుర్నాని స్టార్ హోటల్స్ ఏర్పాటు గురించి వివరించారు. పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి జగన్ వివరించారు. టెక్ మహీంద్ర ఒక్కోక్క హోటల్ నిర్మాణానికి రూ.250 కోట్లు చొప్పున ఖర్చు చేయనుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. విశాఖతో సహా మూడు పర్యాటక ప్రాంతాల్లో  ఈ స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నామని. ఈ మూడు పర్యాటక ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్‌ ఓకే చెప్పింది. వచ్చే రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తామని మహీంద్రా చెబుతోంది. మహీంద్రా గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్, అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీవీఎన్‌ వర్మ, క్లబ్‌ మహీంద్రా సీవోవో సంతోష్‌ రామన్, టెక్‌ మహీంద్రా విజయవాడ అడ్మిన్‌ మేనేజర్‌ బిరుదుగడ్డ జయపాల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి.. సీఎం జగన్ తో టెక్ మహీంద్రా ప్రతినిధులు భేటీ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియేజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి