iDreamPost

ఐఫోన్ సంస్థలో పెళ్లైన మహిళలకు నో జాబ్ వార్తలు! కంపెనీ క్లారిటీ

దేశంలో ఎక్కడా లేని రూల్ ఐఫోన్ తయారీ సంస్థలో ఉన్నట్లు మీడియాలో ఓ కథనం వచ్చింది. ప్రముఖ మొబైల్ సంస్థ ఐఫోన్ తయారీ కంపెనీ.. పెళ్లైన మహిళలకు ఉద్యోగాల్లో నియమించుకోవడం లేదని ఆ వార్త సారాంశం. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది... చివరకు

దేశంలో ఎక్కడా లేని రూల్ ఐఫోన్ తయారీ సంస్థలో ఉన్నట్లు మీడియాలో ఓ కథనం వచ్చింది. ప్రముఖ మొబైల్ సంస్థ ఐఫోన్ తయారీ కంపెనీ.. పెళ్లైన మహిళలకు ఉద్యోగాల్లో నియమించుకోవడం లేదని ఆ వార్త సారాంశం. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది... చివరకు

ఐఫోన్ సంస్థలో పెళ్లైన మహిళలకు  నో జాబ్ వార్తలు! కంపెనీ క్లారిటీ

ఇన్నాళ్లు వంటగదిలో మగ్గిపోయిన మగువలు.. ఇప్పుడిప్పుడే కాలు బయటకు పెట్టి ఉద్యోగాల బాట పడుతున్నారు. కుటుంబానికి ఆర్థికంగా, ఆసరాగా నిలుస్తున్నారు. అలాగే పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకెళుతున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా మహిళలకు ఉద్యోగాల కల్పన చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఓ బడా కంపెనీ వివాహితులకు జాబ్ నుండి తీసేసి చర్చనీయాంశమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఓ రాష్ట్రప్రభుత్వం నుండి వివరణ కోరింది. పెళ్లైన మహిళలను ఉద్యోగంలో తీసేస్తూ వింత నిబంధనను అవలంభిస్తోంది ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్.

తమిళనాడులోని చెన్నై సమీపంలోని శ్రీ పెరంబదూర్ ఫ్లాంట్ ఈ నిబంధనను ఎప్పటి నుండో అమలు చేస్తుంది. ఇందులో పెళ్లైన మహిళల్ని ఉద్యోగంలో చేర్చుకోవడం లేదు. అలాగే అందులో పనిచేస్తూ పెళ్లి చేసుకున్నా కూడా జాబ్ నుండి తొలగిస్తుంది ఫాక్స్ కాన్. వీళ్ల హెయిరింగ్ రూల్స్ కూడా ఈ నిబంధన చేర్చినట్లు రాయిటర్స్ తన కథనంలో వెల్లడించింది. పెళ్లైన వివాహితులకు కుటుంబ బాధ్యతలు, గర్భదారణ సమయంలో లీవ్స్ తీసుకుంటారన్న ఉత్పాదకత తగ్గే అవకాశం ఉన్న కారణంగా కంపెనీ అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో ఉద్యోగాలిచ్చేందుకు వెనకాడుతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఇందులో వర్క్ చేసిన హెచ్ఆర్ అండ్, ఫాక్స్ కాన్ హైరింగ్ ఏజెంట్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. దీనిపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది.

1976 సమాన వేతన చట్టాన్ని (రిక్రూట్ మెంట్ సమయంలో పురుషులు, మహిళలు వంటి వివక్షకు తావినివ్వకూడదు) ఉదహరిస్తూ.. తమిళనాడులోని లేబర్ డిపార్ట్ మెంట్ నుండి వివరణాత్మక నివేదికను కోరింది. అలాగే వాస్తవిక నివేదకను అందించాలని ప్రాంతీయ చీఫ్ లేబర్ కమీషనర్ కార్యాలయాన్ని కూడా ఆదేశించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కేంద్రం నుండి వివరణ కోరిన కొద్ది నిమిషాల్లో ఫాక్స్ కాన్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది. తాము కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిలో 25 శాతం మంది వివాహితులేనని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మీడియా కథనాల వల్ల వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ కంపెనీలో 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారని తెలిపింది. వివాహం, లింగం, మతం లేదా మరేదైనా కారణాలతో నియమాకాల విషయంలో వివక్ష చూపుతున్నామన్న వాదనను తీవ్రంగా ఖండించింది సదరు సంస్థ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి