iDreamPost

స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే.. మిస్ చేసుకోకండి

Indian Navy recruitment 2024: మీరు స్పోర్ట్స్ బాగా ఆడినట్లైతే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే. ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

Indian Navy recruitment 2024: మీరు స్పోర్ట్స్ బాగా ఆడినట్లైతే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే. ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే.. మిస్ చేసుకోకండి

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్కిల్స్ కూడా కలిగి ఉండాలి. పోటీ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపించాలి. అన్ని దశలను దాటుకుంటేనే తప్పా గవర్నమెంట్ కొలువు సాధ్యం కాదు. నేటి రోజుల్లో ప్రభుత్వ కొలువులకు కాంపిటీషన్ విపరీతంగా ఉంది. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా లక్షలాది మంది పోటీ పడుతున్నారు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. మీరు స్పోర్ట్స్ బాగా ఆడితే ఈ ఉద్యోగాలు మీకోసమే. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు వెంటనే అప్లై చేసుకోండి.

మీరు స్పోర్ట్స్ బాగా ఆడినట్లైతే ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. రాత పరీక్ష లేకుండానే జాబ్ సొంతం చేసుకోవచ్చు. ఇండియన్ నేవీలో ‘సెయిలర్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా ఎంట్రీ (02/2024 బ్యాచ్) కింద ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత క్రీడాంశంలో ఇంటర్నేషనల్‌ లేదా జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులై ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్పోర్ట్స్‌ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • సెయిలర్‌- స్పోర్ట్స్ కోటా ఎంట్రీ- 02/2024 బ్యాచ్

అర్హత:

  • 10+2 ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్‌/జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 17.5-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

క్రీడాంశాలు (పురుష అభ్యర్థులకు):

  • అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, ఈక్వెస్ట్రియన్(గుర్రపుస్వారీ), ఫుట్‌బాల్, ఫెన్సింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, తదితర క్రీడలున్నాయి.

క్రీడాంశాలు (మహిళా అభ్యర్థులకు):

  • అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, కయాకింగ్ అండ్ కానోయింగ్, రోయింగ్, షూటింగ్, సెయిలింగ్.

కనీస ఎత్తు ప్రమాణాలు:

  • పురుషులు 157 సెం.మీ, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌లైన్

ఎంపిక విధానం:

  • స్పోర్ట్స్‌ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ట్రైనింగ్:

  • ఎంపికైనవారికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌ లైన్‌

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

  • సెక్రటరీ,
    ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్,
    7వ ఫ్లోర్, చాణక్య భవన్, నావల్ హెడ్ క్వార్టర్స్,
    మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, న్యూ ఢిల్లీ.

దరఖాస్తుకు చివరితేదీ:

  • 20-07-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి