ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠతకు తొలి పునాది వలంటీర్ల వ్యవస్థ. సీఎం జగన్ ఆలోచనకు దీపిక అది. ఆ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ఏపీ ప్రజలు కనీవినీ ఎరుగని సేవలను పొందుతున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఏపీ ప్రభుత్వం ఖ్యాతి దేశవ్యాప్తమైంది. వలంటీర్ల వ్యవస్థ పనితీరును ప్రముఖులెందరో మెచ్చుకుంటున్నారు. ఇదే ప్రతిపక్షాలకు ఇబ్బందిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థను తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే… 2019లో […]
ఈ రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ మోగింది. లిఫ్ట్ చేయగానే.. ఆవల వైపు నుంచి తమ్ముడు. ‘‘ అన్నా.. మన వాలంటీర్ ఫోన్ చేసింది. మాచవరం ప్రాథమిక వైద్యశాలకు వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోవాలట. ఈ రోజు వెళ్లి బ్లడ్ శాంపిల్ ఇవ్వాలని చెప్పింది.’’ అన్నాడు ఓకింత ఆందోళన స్వరంతో. ఎందుకు ఆందోళన.. వెళ్లి చేయించుకో. మంచిదే కదా అన్నాను. ‘‘టెస్ట్ చేయించుకోవడానికి ఇబ్బంది లేదు. ఇంకా చాలా సంతోషమే. కానీ ఈ రోజు చాలా […]
కాదేది కవితకు అనర్హం అని ఓ మహా కవి అన్నట్లు.. కాదేది మద్యం అక్రమ రవాణాకు అనర్హం.. అనే మాటను ఆంధ్రప్రదేశ్లోని అక్రమార్కులు బాగా ఒంటపట్టించుకున్నట్లుగా ఉన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధంలో భాగంగా దుకాణాల తగ్గింపు, విక్రయాలపై పరిమితి, ధరల పెంపు వంటి చర్యలను వైసీపీ సర్కార్ చేపట్టడంతో అక్రమ మద్యం అమ్మకాన్ని కొంత మంది వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు. పంట రవాణా లారీ, పాల […]
ఏడాది కూడా కాకముందే ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు వాలంటీర్లు అందరి మన్ననలు పొందుతున్నారు. గత ఏడాది ఆగస్టులో వీరిని వైసీపీ సర్కార్ నియమించినప్పుడు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, అనుమానాలు వ్యక్తం చేశాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల మాదిరిగా వాలంటీర్లు కూడా వ్యవహరిస్తారంటూ టీడీపీ మినహా, బీజేపీ ఇతర పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక టీడీపీ అయితే వీరందరూ వైసీపీ కార్యకర్తలని, ఆ పార్టీ వారికే పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసుకున్నారని […]
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామాలు ఎలా ఉండాలి అన్న అంశం పై తన కలని ఆవిష్కరించిన జగన్ . త్వరలో అన్ని గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ , వైఎస్సార్ జనతా బజార్ లు కూడా ఏర్పాటు చేయనున్న వైసీపీ ప్రభుత్వం . ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా విలేజ్ వలంటీర్ , గ్రామ సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసే క్రమంలో విపక్షాలు పలు విధాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా 1.3 లక్షల […]
జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్ధపై ముస్సోరీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముస్సోరీలో శిక్షణను పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన ఐఏఎస్ లు జగన్మోహన్ రెడ్డితో భేటి అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్ధపై తమ శిక్షణలో అనేక సార్లు చర్చలు జరిగినట్లు చెప్పారు. పై రెండు అంశాలపైనే కాకుండా అధికార వికేంద్రీకరణపైన కూడా అనేక చర్చలు జరిపినట్లు చెప్పటం విశేషం. మామూలుగా […]
వాలంటీర్ల వ్యవస్ధ పనితీరుపై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అదే అర్ధమవుతోంది. వాలంటీర్ల వ్యవస్ధ ఏర్పడినప్పటి నుండి చంద్రబాబునాయుడు పదే పదే వాలంటీర్లను టార్గెట్ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. మొదట్లో ఏమో మగవాళ్ళు లేనపుడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి తలుపులు తడుతుంటే ఆడవాళ్ళు భయపడుతున్నట్లు ఆరోపణలు చేశాడు. తర్వాతేమో వాలంటీర్లు మూటలు మోస్తున్నాడన్నాడు. మళ్ళీ 5 వేల రూపాయలకు పనిచేసే వాలంటీర్లకు పిల్లను కూడా ఎవరూ ఇవ్వటం లేదంటూ ఎద్దేవా చేశాడు. ఈమధ్యనే […]
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో, లాక్డౌన్ సమయంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు వాలంటరీ లు చేస్తున్న కృషిని దేశమంతా కీర్తి స్తోంది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ మీడియా వాలంటీర్ల సేవలను కొనియాడుతున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కనిపించనట్లుగా ఉన్నాయి. కరోనా ఆపత్కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇంటింటి సర్వే లు, ప్రజలకు నిత్యావసరాలు, పింఛన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్ల పై చంద్రబాబు మళ్లీ […]
మనిషి జీవితంలో అన్నింటికన్నా అంత్యక్రియల సందర్భంగా సాటి వారి అవసరం ఎక్కువ. ఆ నలుగురు లేకపోతే అసలు కార్యక్రమమే సాగడం చాలా కష్టం. అలాంటిదిప్పుడు కరోనా వేళ చాలామంది మొఖం చాటేస్తున్నారు. బంధువులు, స్నేహితులు అనే విషయాన్ని కూడా తాత్కాలికంగా మరుగునపరుస్తున్నారు. వైరస్ ఏ రూపంలో వ్యాప్తిచెందుతోననే భయమే దానికి మూలం. అయినప్పటికీ కొందరు మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ కార్యక్రమం బాద్యతలు తీసుకుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ వారు కాకపోయినా మనిషితత్వం చాటుతున్న తీరు […]
ఉపాధి కల్పనకు ఇదో కొత్తమార్గం – సీఎం యోగి యోచన యువతకు స్థానికంగానే చిన్నపాటి ఉపాధి చూపించి, వారి ఎదుగుదలకు బాటలు వేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఇంకో ముఖ్యమంత్రికి స్ఫూర్తిని ఇచ్చాయి. ఏపీ వేసిన మార్గంలో నడిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లను లక్షల మందిని నియమించి, వారిద్వారా ప్రజలకు రేషన్, ఇంకా సంక్షేమ పథకాలు అందించడం ద్వారా అటు ప్రజలకు ఇటు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. […]