Dharani
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ.. సంక్షేమ పథకాలను జనాల ఇంటి వద్దకే చేరుస్తున్న వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి ఒక్కొక్కరికి 45 వేలు ఇవ్వనుంది. ఆ వివరాలు..
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ.. సంక్షేమ పథకాలను జనాల ఇంటి వద్దకే చేరుస్తున్న వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి ఒక్కొక్కరికి 45 వేలు ఇవ్వనుంది. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలు, పాలనను ప్రజల వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో.. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. దీని ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకే చేర్చారు. ఫించను మొదలు.. సర్టిఫికెట్ల వరకు.. ప్రజలకు ప్రభుత్వంతో అవసరమైన ప్రతి విధిని నెరవేర్చడం కోసం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీని ద్వారా పాలనను ప్రజల చెంతకు చేర్చడమే కాక.. యువతకు సొంత ఊరిలోనే ఉపాధి కల్పిస్తున్నారు సీఎం జగన్. వాలంటీర్ల ద్వారా అందిస్తున్న సేవలు అమోఘం.
ప్రకృతి విపత్తులు సంభవించినా.. పండగలు, ఆదివారాలు, సెలవులు సైతం పక్కకు పెట్టి.. ప్రజలకు సేవలు అందిస్తున్నారు వాలంటీర్లు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ.. సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల సేవలను అభినందించేందుకు గాను జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజలకు సేవలు అందించే విషయంలో ఉత్తమ పని తీరు కనబరిచిన వాలంటీర్లను జగన్ సర్కార్ ప్రతి ఏటా సత్కరిస్తోన్న సంగతి తెలిసిందే. వాలంటీర్లకు వందనం పేరుతో ఏటా కార్యక్రమం నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈ కార్యక్రమంలో వారిని సత్కరించి నగదు పురస్కారాలు అందిస్తోంది. అయితే.. ఈసారి వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగదు పురస్కారం కింద అందించే మొత్తాన్ని భారీగా పెంచింది.
వరుసగా నాలుగో ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించనుంది జగన్ సర్కార్. నేడు అనగా ఫిబ్రవరి15 గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరిట అవార్డులను అందిస్తారు.
అయితే… ఈసారి వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి అందించే నగదు పురస్కారం మొత్తాన్ని భారీగా పెంచింది. సేవా వజ్ర కింద ఇప్పటి వరకూ 30 వేల రూపాయల నగదు పురస్కారం అందిస్తుండగా.. ఈ మొత్తాన్ని 45 వేలకు పెంచారు. సేవా రత్న అవార్డు విన్నర్లకు ఇచ్చే మొత్తాన్ని 20 వేల నుంచి 30 వేలకు పెంచారు. అలాగే సేవామిత్రగా నిలిచిన వాలంటీర్లకు ఇచ్చే మొత్తాన్ని కూడా పది వేల నుంచి 15 వేలకు పెంచారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమంగా సేవలు అందించిన మొదటి ఐదుమంది వాలంటీర్లను సేవా వజ్ర కింద ఎంపిక చేసి ఒక్కొక్కరికి 45 వేల నగదు,సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో సత్కరిస్తారు. ఈ విభాగం కింద 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేస్తారు.