iDreamPost
android-app
ios-app

Volunteers: వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త.. రూ.10 వేల నుంచి 30 వేల వరకూ

  • Published Dec 29, 2023 | 9:09 AMUpdated Dec 29, 2023 | 11:00 AM

ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పింది. కొన్ని రోజుల క్రితమే వారి జీతాలు పెంచిన సర్కార్.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయ్యింది. ఆ వివరాలు..

ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పింది. కొన్ని రోజుల క్రితమే వారి జీతాలు పెంచిన సర్కార్.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Dec 29, 2023 | 9:09 AMUpdated Dec 29, 2023 | 11:00 AM
Volunteers: వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త.. రూ.10 వేల నుంచి 30 వేల వరకూ

ఆంధ్రప్రదేశ్ లో తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికే అనేక మంది ప్రశంసలు కురిపించారు. వీరి ద్వారా ప్రభుత్వ పథకాలన్ని నేరుగా లబ్ధిదారులు చెంతకే చేరుతున్నాయి. అలానే ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా పని కావాలన్నా.. ఏదైనా పథకానికి, సర్టిఫికెట్లకు అప్లై చేసుకోవాలన్నా వాలంటీర్లకు చెప్తే చాలు. జగన్ సర్కార్ తీసుకువచ్చిన వాలంటీర్ల వల్ల చదువురాని వారు, వృద్ధులు, వికాలంగులకు ప్రభుత్వం నుంచి అందే సేవలన్ని వారి గుమ్మం వద్దకే వచ్చి చేరుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు వారు చేస్తోన్న సేవలు అమోఘం. కొన్ని రోజుల క్రితమే వాలంటీర్ల జీతాలు పెంచిన జగన్ సర్కార్ తాజాగా వారికి మరో శుభవార్త చెప్పింది. వాలంటీర్లు 10 వేల నుంచి 30 వేల రూపాయల వరకు పొందే అవకాశం ప్రకటించారు. ఆ వివరాలు..

ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ప్రతి ఏటా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఈ అవార్డులను అందజేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గం, మండలం నుంచి ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర కింద రూ.30వేలు.. మున్సిపాలిటీలో 10మంది వాలంటీర్లను ఎంపిక చేసి వారికి సేవా రత్న కింద రూ.20వేలు ఇస్తారు. అలానే సేవా మిత్ర కింద రూ.10వేలు ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పింఛన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు.

ఇదిలా ఉంచితే ఏపీ ప్రభుత్వం.. జనవరి నుంచి పింఛన్లను పెంచనుంది. అర్హులైన వారందరిని.. రూ.3 వేల సామాజిక ఫించన్ చెల్లించనున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ మొత్తాన్ని రూ.2 వేల నుంచి దశల వారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. వైఎస్‌ఆర్‌ పింఛన్‌, ఆసరా, చేయూత పథకాల అమలు, అంబేడ్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పింఛన్ల కోసం నెలకు రూ.1,950 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం జగన్. ప్రజాప్రతినిధులందరూ పింఛన్‌ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.

అలానే పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో పంపాలని, వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంపికచేసి బహుమతులు అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ‘ప్రభుత్వ పథకాలు వారి జీవితాలను ఎలా మార్చాయనేది వీడియోల్లో చూపించాలి అన్నారు. ఉత్తమమైన వాటికి సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు బహుమతిగా ఇస్తామని తెలిపారు.

అలానే పొదుపు సంఘాల మహిళలను ఆర్థికంగా ఆదుకునేలా జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమం.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను ఆదుకునేందుకు తీసుకువచ్చిన చేయూత పథకాన్ని ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ నిర్వహిస్తామని తెలిపారు. దీని వల్ల సుమారు 26.39 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామన్నారు. జనవరి 19న విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. 19 ఎకరాల్లో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం రూ.404 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం నుంచి ఐదుగురిని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి