Idream media
Idream media
ఉపాధి కల్పనకు ఇదో కొత్తమార్గం – సీఎం యోగి యోచన
యువతకు స్థానికంగానే చిన్నపాటి ఉపాధి చూపించి, వారి ఎదుగుదలకు బాటలు వేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఇంకో ముఖ్యమంత్రికి స్ఫూర్తిని ఇచ్చాయి. ఏపీ వేసిన మార్గంలో నడిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లను లక్షల మందిని నియమించి, వారిద్వారా ప్రజలకు రేషన్, ఇంకా సంక్షేమ పథకాలు అందించడం ద్వారా అటు ప్రజలకు ఇటు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. తమ ఇళ్లవద్దకే రేషన్, పెన్షన్లు అందడమే కాకుండా స్థానికంగా ఉద్యోగం వచ్చినందుకు యువత కూడా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. లాక్ డవున్ నేపథ్యంలో దేశంలోని వివిధాప్రాంతాల నుంచి లక్షల మంది వలసకూలీలు తమ సొంత గ్రామాలకు చేరుతున్నారు. వారికి స్థానికంగా ఉపాధి కల్పించడానికి డోర్ డెలివరీ సిస్టం అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
2017లో తమ ప్రభుత్వం రాకముందు వలసలు అదికంగా ఉన్నాయని, ఇప్పుడు వాళ్లు చాలా మంది వెనక్కి వస్తున్నందున వారికి ఉపాది కల్పించడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.అందులో భాగంగా లాక్ డౌన్ టైమ్ లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను డోర్ డెలివరీ చేయడానికి లక్షన్నర మందిని నియమించామని ఆయన చెప్పారు.అలాగే గ్రామీణ ఉపాధి హామీ పధకం,చిన్నపరిశ్రమలు తదితర రంగాల ద్వారా వీరికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. మొత్తానికి ఆంధ్రాలో మొదలైన వలంటీర్ల వ్యవస్థ ఉత్తరప్రదేశ్ ను ప్రభావితం చేసిందన్నమాట.