iDreamPost
android-app
ios-app

మే నెల వై.యస్.ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసిన జగన్ సర్కార్

  • Published May 01, 2020 | 7:15 AM Updated Updated May 01, 2020 | 7:15 AM
మే నెల వై.యస్.ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసిన జగన్ సర్కార్

రాష్ట్రం లో జగన్ ప్రభుత్వం ఒక పక్క కరోనా మహమ్మారితో పోరాడుతూనే రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది . దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమాన్ని విడవకుండా రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ఖజాన లాక్ డౌన్ కారణంగా నిండుకున్నా కూడా ప్రజలకు అందంచవలసిన సంక్షేమంలో మాత్రం జగన్ ప్రభుత్వం రాజీపడటంలేదు. గడచిన నెల మాదిరే రాష్ట్రంలో ఉన్న వై.యస్.ఆర్ పెన్షన్ కానుక లబ్ది దారులకు మే నెల పెన్షను పంపిణీ పూర్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల చేతికి మే నెల వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక అంధించారు. పెన్షన్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 1,421.20 కోట్లను వాలంటీర్లు 57.86 లక్షల మంది లబ్దిదారులకు అందచేశారు. కరోనా నియంత్రణలో భాగంగా గడచిన నెల మాదిరే బయో మెట్రిక్‌కు బదులుగా పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్‌ ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో కూడా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తు వై.యస్.ఆర్ పెన్షన్ కానుక పంపిణీనే కాకుండా జగనన్న విధ్యా దీవెన , సున్నా వడ్డీ పదకాలు అమలు చేసి సంచలనం సృష్టిoచిన విషయం తెలిసిందే. ఒక పక్క కరోనా ని సమర్ధవంతంగా ఎదుర్కుంటూనే , మరో పక్క సంక్షేమాన్ని కూడా సమపాలల్లో నడిపిస్తున్న జగన్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.