మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో మెగా హీరో అల్లు అర్జున్, పూజా హెగ్దే జంటగా నటించిన సినిమా అల వైకుంఠపురంలో.. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. అమెరికాలో మూడు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దుమ్ములేపింది. సినిమాలోని కంటెంట్ తో పాటుగా యూనిట్ కష్టపడి చేసిన పబ్లిసిటీకి […]
ఈ ఏడాది తొలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు నమోదు చేసుకున్న అల వైకుంఠ పురములో డిజిటల్ టెలికాస్ట్ అర్ధరాత్రి నుంచి మొదలైపోయింది. మొన్న 26నే వస్తుందని ప్రకటించి వాయిదా వేయడం పట్ల నెటిజన్లు భగ్గుమన్నారు. ఈ సినిమా కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ఇది మరింత ఆగ్రహం కలిగించింది. మరి దానికి తలొగ్గారో లేక సాంకేతిక సమస్య వల్ల ఆలస్యమయ్యిందో తెలియదు కానీ మొత్తానికి 27 నుంచి సన్ నెక్స్ట్ యాప్ లో అల వైకుంఠపురములో […]
సంక్రాంతి బరిలో విజేతగా నిలిచి నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలుకొట్టే దిశగా దూసుకెళుతున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ బంఫర్ హిట్ సినిమా అల వైకుంఠపురములో ఇప్పటికి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు కూడా విడుదలైన ఆరు వారాలకే OTT లో వస్తుండటంతో చాలా మంది ప్రేక్షకులు కొద్దీ రోజులు ఆగి amozon prime /netflix/hotstar/sun nxt లో చూద్దాంలే అనుకోవటంతో సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. తమ సినిమా మీద ఈ ప్రభావం పడకుండా […]
ఏదేని భాషలో హిట్ అయిన సినిమాలను ఆ సినిమా హక్కులను కొని మిగిలిన భాషల్లో రీమేక్ చేసి హిట్ కొట్టడానికి నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం రీమేక్ రైట్స్ కొనకుండానే కొన్ని సినిమాలను రూపొందిస్తారు.. వీటినే ఫ్రీమేకులు అంటారు. అలా వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను తమకు(నిర్మాతలకు) తెలియకుండా రూపొందిస్తే సదరు నిర్మాతలు కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంటారు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాలను, బాలీవుడ్ సినిమాలను మక్కికి మక్కీ దించేసి యాదృశ్చికంగా జరిగి […]
ఏడాదిన్నర క్రితం వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత మరో కొత్త సినిమా లేక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా వెయిటింగ్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడి వచ్చే ఏడాదికి వెళ్లిపోవడంతో మొత్తం మీద రెండేళ్లకు పైగా నిరీక్షణ భరించక తప్పదని అర్థమైపోయింది. రాజమౌళి మూవీ కాబట్టి ఈ మాత్రం సర్దుబాట్లు తప్పవు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఎవరితో సినిమాలు చేస్తాడనే దాని మీద పూర్తి స్పష్టత రావడం లేదు […]
సంక్రాంతి పండక్కు వచ్చి ఏకంగా నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో త్వరలో హిందీలోకి వెళ్లబోతోంది. మొదట రీమేక్ రైట్స్ అమ్మాలనుకున్నా తర్వాత ఇక్కడ నిర్మించిన బ్యానర్ల పైనే పార్ట్ నర్ షిప్ మీద బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తారట. అయితే డైరెక్షన్ త్రివిక్రమ్ చేయడు. కేవలం కథ స్క్రీన్ ప్లే వరకే ఆయన ప్రమేయం ఉంటుంది. ఫామ్ లో ఉన్న ఇంకో దర్శకుడిని రీమేక్ కోసం సెట్ చేస్తారు. అయితే […]
అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమాకు గ్రౌండ్ రెడీ చేసుకున్నట్టుగా లేటెస్ట్ అప్ డేట్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళ సాయంత్రం 5 గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ లో తన పార్ట్ షూటింగ్ మే లేదా జూన్ లో పూర్తయిపోతుందట. ఆ తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండా త్రివిక్రమ్ […]
అల వైకుంఠపురములోతో మరో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇంకోసారి కాపీ చిక్కు చికాకు పెడుతుందని ఫిలిం నగర్ సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో దీని గురించి విస్తృత చర్చ జరుగుతోంది. దాని ప్రకారం అల వైకుంఠపురములో కథ తనదని 2005లోనే త్రివిక్రమ్ కు చెప్పానని దాన్ని దశ దిశ పేరుతో ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించానని చెబుతున్నాడు కృష్ణ అనే రచయిత. అయితే ఆ కథ అప్పటి నుంచి […]
తీన్మార్ సినిమా గుర్తుందిగా. పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్. కానీ దీని ఒరిజినల్ వెర్షన్ హిందీలో రూపొందిన లవ్ ఆజ్ కల్ అప్పట్లో బ్లాక్ బస్టర్. సైఫ్ అలీ ఖాన్- దీపికా పదుకునే జంటగా నటించిన ఈ రొమాంటిక్ అండ్ పీరియాడిక్ స్టొరీ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు . దెబ్బకు దర్శకుడు ఇంతియాజ్ అలీ టాప్ లిస్టులోకి చేరిపోయాడు. ఇప్పుడు […]