iDreamPost
android-app
ios-app

మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! సర్​ప్రైజ్​ క్యాన్సిల్!

  • Author Soma Sekhar Published - 07:44 PM, Wed - 13 September 23
  • Author Soma Sekhar Published - 07:44 PM, Wed - 13 September 23
మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! సర్​ప్రైజ్​ క్యాన్సిల్!

గుంటూరు కారం.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం. ఈ మూవీకి సంబంధించిన టెక్నిషియన్స్ ఒక్కొక్కరుగా తప్పుకోవడంతో.. ఈ మూవీపై నీలినీడలు నెలకొన్నాయి. దాంతో ఈ చిత్రం అనుకున్న డేట్ కు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్న సందేహాలు మెుదలైయ్యాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ మహేష్ బాబు సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి బరిలో ఉంటుందని సూపర్ స్టార్ స్పష్టం చేశాడు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది. ఈ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గుంటూరు కారం మూవీకి సంబంధించిన ఓ సర్ప్రైజ్ వస్తుందని భావిస్తున్న అభిమానులకు షాక్ ఎదురైయ్యేలా ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గుంటూరు కారం’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దిగబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. గుంటూరు కారం మూవీని మ్యూజికల్ గా చార్ట్ బస్టర్ హిట్ చేసేందుకు టీమ్ ప్రత్యేక ఇంట్రెస్ట్ పెట్టిందట. అద్భుతమైన ఆల్బమ్ సిద్దం చేసేందుకు యూనిట్ ఎంతగానో శ్రమిస్తుందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక్క సాంగ్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ పుట్టినరోజుకు ఓ సాంగ్ ను రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ సాంగ్ రిలీజ్ అవ్వలేదు. ఇక తాజాగా వినాయక చవితికి రిలీజ్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. వినాయక చవితి పండుగకు కూడా గుంటూరు కారం నుంచి సాంగ్ రావట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే సాంగ్ ఇంకా రెడీ అవ్వలేదని సమాచారం.

కాగా.. ఈ వార్త ఎంతో కాలం ఆశగా సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశను కలిగిస్తుంది. ఇక ఈ చిత్రంలో రెండు మెయిన్ సాంగ్స్ తో పాటుగా ఓ థీమ్ సాంగ్ ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. అతడు సినిమాలో లాగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తూ.. లిరిక్స్ రాసి అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి గుంటూరు కారం నుంచి సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరపడేది ఎప్పుడో? వేచి చూడాలి.  ఈ మూవీకి సంగీతం థమన్ అందిస్తున్న విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş