iDreamPost
android-app
ios-app

వెంకటేష్-నాని కాంబోలో మల్టీ స్టారర్.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో..?

మహేష్ బాబు- ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి రేసులో దిగుతున్న ఈ మూవీ థియేటర్లకు రాకుండానే.. ఇప్పుడో బజ్ నడుస్తోంది.

మహేష్ బాబు- ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి రేసులో దిగుతున్న ఈ మూవీ థియేటర్లకు రాకుండానే.. ఇప్పుడో బజ్ నడుస్తోంది.

వెంకటేష్-నాని కాంబోలో మల్టీ స్టారర్.. త్రివిక్రమ్  డైరెక్షన్‌లో..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారాన్ని నూరుతున్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవుడ్ అంట్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుంది. మునుపెన్నడూ చూడని విధంగా సూపర్ స్టార్ మాస్ లుక్స్‌ లో కనిపించబోతున్నాడని బజ్ బాగా నడుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై ఎస్ రాధాకృష్ణ, నాగవంశీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరామ్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 12న థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ మూవీలో మూడు పాటలు రిలీజై.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ ఇంకా విడుదల కానే లేదు.. ఇప్పుడు మరో హాటెస్ట్ న్యూస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ షురూ చేశారని. ఈసారి ఏకంగా ఆయన మల్టీస్టారర్ మూవీ ఫిక్స్ చేశారని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు డైరెక్ట్ చేయని హీరోలతో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నాని దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని.. ఈ ప్రాజెక్టుపై కసరత్తులు చేయనున్నారట త్రివిక్రమ్. కథ కూడా సిద్ధమైందని.. ఈ ఇద్దరు హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

వెంకీ మామను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయలేదు కానీ.. అతని సినిమాలకు వర్క్ చేశారు. అందరి ఆల్ టైం ఫేవరేట్ హిట్ ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీకి మాటలు అందించింది ఈ మాటల మాంత్రికుడే. అలాగే వాసు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు కూడా తన పెన్ నుండి డైలాగులు రాల్చారీ దర్శకుడు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి మూవీల్లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తూటాల్లా పేలుతుంటాయి. ఎప్పుడో వీరి కాంబోలో సినిమా రావాల్సింది. గతంలో కూడా విక్టరీతో వెంకటేష్ తో మూవీ ఉంటుందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇక నానితో త్రివిక్రమ్ తో పనిచేస్తే.. తన ఖాతాలో మరో స్టార్ డైరెక్టర్ చేరిపోతున్నట్లే లెక్క. మరీ ఈ కాంబోలో మూవీ అంటే.. ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş