iDreamPost
android-app
ios-app

Venkatesh: ‘నువ్వు నాకు నచ్చావ్’ సీక్వెల్.. వెంకటేశ్ సమాధానం ఇదే!

  • Author Soma Sekhar Published - 08:46 PM, Mon - 11 December 23

'సైంధవ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 'నువ్వు నాకు నచ్చావ్' మూవీ సీక్వెల్ పై స్పందించాడు వెంకీ మామ. సీక్వెల్ పై ఏమన్నాడంటే?

'సైంధవ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 'నువ్వు నాకు నచ్చావ్' మూవీ సీక్వెల్ పై స్పందించాడు వెంకీ మామ. సీక్వెల్ పై ఏమన్నాడంటే?

  • Author Soma Sekhar Published - 08:46 PM, Mon - 11 December 23
Venkatesh: ‘నువ్వు నాకు నచ్చావ్’ సీక్వెల్.. వెంకటేశ్ సమాధానం ఇదే!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. టాలీవుడ్ లో అలాంటి సినిమాల్లో విక్టరీ వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ కచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఊహించని ఘన విజయాన్ని అందుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ మూవీకి కథ, మాటలు అందించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఓ మూస పద్దతిలో సాగిపోతున్న కామెడీ మూవీలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ సీక్వెల్ కోసం ఎంతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తిలేదు. అయితే తాజాగా ‘సైంధవ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నువ్వు నాకు నచ్చావ్ మూవీ సీక్వెల్ పై స్పందించాడు వెంకీ మామ. సీక్వెల్ పై ఏమన్నాడంటే?

‘సైంధవ్’.. డైరెక్టర్ శైలేష్ కొలను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, అండ్రియా, రుహానీ శర్మతో పాటుగా ఆర్య కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగానే.. సైంధవ్ మూవీ టీమ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని అనంతరం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విలేకరుల సమావేశంలో వెంకీ మామను నవ్వు నాకు నచ్చావ్ సీక్వెల్ ఎప్పుడంటూ ఓ రిపోర్టర్ ప్రశ్న అడిగాడు.

ఈ క్రమంలోనే దానికి నవ్వులు పూయించే ఆన్సర్ ఇచ్చాడు. సదరు విలేకరి ప్రశ్నకు “మీరు వెంటనే త్రివిక్రమ్ కు కథ రాయమని చెప్పండి”అంటూ ఆన్సర్ ఇచ్చాడు వెంకీ మామ. దీంతో అక్కడ అంతా నవ్వులు పూశాయి. అనంతరం వెంటేశ్ మాట్లాడుతూ..”మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. బాగా చదువుకోండి, క్రమశిక్షణ అలవరుచుకోండి. ఎప్పుడూ పాజిటీవ్ గా ఆలోచించండి, నెగటివ్ గా ఆలోచిస్తే సంతోషంగా ఉండలేరు” అంటూ చెప్పుకొచ్చారు. మరి మీలో ఎంత మంది నువ్వు నాకు నచ్చావ్ మూవీకి సీక్వెల్ రావాలని కోరుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabettaraftarium24 girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom