iDreamPost
android-app
ios-app

Mahesh Babu: సంక్రాంతి రేసులో గుంటూరోడి పవర్! ఇదీ మహేశ్ స్టామినా!

  • Author Soma Sekhar Updated - 11:30 AM, Wed - 13 December 23

2024 సంక్రాంతి రేసులో దాదాపు అరడజనుకు పైగా చిత్రాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అయితే ఈ రేసులో ముందున్నాడు సూపర్ స్టార్ మహేశ్. మరి ఈ గుంటూరోడి పవర్ చూసి.. మిగతా చిత్రాలు ముందుకు దూకుతాయా? లేదా? ఓసారి పరిశీలిద్దాం.

2024 సంక్రాంతి రేసులో దాదాపు అరడజనుకు పైగా చిత్రాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అయితే ఈ రేసులో ముందున్నాడు సూపర్ స్టార్ మహేశ్. మరి ఈ గుంటూరోడి పవర్ చూసి.. మిగతా చిత్రాలు ముందుకు దూకుతాయా? లేదా? ఓసారి పరిశీలిద్దాం.

  • Author Soma Sekhar Updated - 11:30 AM, Wed - 13 December 23
Mahesh Babu: సంక్రాంతి రేసులో గుంటూరోడి పవర్! ఇదీ మహేశ్ స్టామినా!

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. బాక్సాఫీసులు కొత్త కొత్త సినిమాలతో కళకళలాడుతూ ఉంటాయి. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ఈ పండుగను క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. అందుకోసమే తమ సినిమాలకు ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ, సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తుంటారు. ఇక వచ్చే ఏడాది అంటే 2024 సంక్రాంతి బరిలోకి దాదాపు అరడజనుకు పైనే సినిమాలు బాక్సాఫీసుపై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా మేం సంక్రాంతి బరిలో ఉంటున్నాం అంటూ రిలీజ్ డేట్స్ ను ప్రకటించేశాయ్ ఇప్పటికే కొన్ని చిత్రాలు. అయితే ఈ రేసులో ముందున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మరి మహేష్ తో పోటీ పడి మిగతా సినిమాలు నిలుస్తాయా? లేదా? కాస్త ఆగి ప్రేక్షకుల ముందుకు వస్తాయా? ఓసారి పరిశీలిద్దాం.

‘గుంటూరు కారం’ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 సంక్రాంతి బరిలోకి దిగబోతోంది. వరల్డ్ వైడ్ గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తొలి నుంచే చెప్పుకొస్తున్నారు. ఇక ఈ రేసులో మహేశ్ ముందున్నాడనే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా.. గుంటూరు కారం సినిమా రిలీజ్ కు ఉండటంతో.. పండగ బరిలోకి దిగాలని భావిస్తున్న కొన్ని సినిమాలకు ఆశించిన స్థాయిలో రేట్స్ పలకడం లేదని సమాచారం. ఎందుకంటే? మహేశ్ సినిమాను కాదని తమ సినిమాను చూడ్డానికి ప్రేక్షకులు వస్తారా? లేదా? అన్న అనుమానం కొందరిలో ఇప్పటికే మెుదలైనట్లు తెలుస్తోంది. ఇక మహేశ్ తో పోటీ అంత ఈజీ కాదని టాలీవుడ్ కు తెలిసిందే.

అయితే పైకి తాము సంక్రాంతి రేసులో ఉన్నామని కొందరు చెప్పుకుంటున్నప్పటికీ.. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది పోటీ నుంచి తప్పుకుంటారని సినీ పండితులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ సంక్రాంతికి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ నటిస్తున్న ‘హనుమాన్’, మాస్ మహారాజ ‘ఈగల్’, కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’లతో పాటుగా విక్టరీ వెంకటేష్-శైలేష్ కొలనుల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సైంధవ్’ కూడా ఈ లిస్ట్ లో ఉంది. దీంతో ఈసారి సంక్రాంతి రేసు ఆసక్తికరంగా మారింది. అయితే రోజులు దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ ఆలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది. మహేశ్-త్రివిక్రమ్ లాంటి కాంబినేషన్ కు ఎదురెళ్లి చేతులు కాల్చుకోవడం ఎందుకని, కాస్త ఆగి ప్రేక్షకుల ముందుకు వస్తే.. లాభం కలుగుతుందని మరోసారి ఆలోచనలో పడ్డారని సమాచారం. అయితే ఇక్కడ ఎవ్వరి నమ్మకాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకోవాలి.

అదీకాక ఇంత మంది స్టార్ హీరోల సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అందించగలరా? అన్నది మరో ప్రశ్న. కాగా.. ఒకవేళ అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. లెక్కల్లో కచ్చితంగా తేడాలు వస్తాయి. ఇక కొన్ని మూవీలకు యావరేజ్, ప్లాప్ టాక్ వస్తే.. రెండు రోజుల్లో థియేటర్ల నుంచి ఆ చిత్రం వెళ్లిపోవడం ఖాయం. ఇదంతా ఒకెత్తు అయితే ఒకే వారంలో అరడజనుకు పైగా సినిమాలను ప్రేక్షకులు చూస్తారా? అన్నది భేతాళ ప్రశ్నగా మారింది. మరి ఇన్ని ఆటంకాలు దాటుకుని, మహేశ్ లాంటి హీరోతో పోటీ పడతారా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.