Nagendra Kumar
తెలుగు ఇండస్ట్రీలో ఈ సంక్రాంతి పండుగ సినిమా పండుగ అనే చెప్పొచ్చు. స్టార్ హీరోలు వరుసగా వెండితెరపై సందడి చేయబోతున్నారు. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో ఈ సంక్రాంతి పండుగ సినిమా పండుగ అనే చెప్పొచ్చు. స్టార్ హీరోలు వరుసగా వెండితెరపై సందడి చేయబోతున్నారు. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Nagendra Kumar
ఇటువంటి సంక్రాంతిని తెలుగు సినిమా పరిశ్రమ ఇంత వరకూ చూడలేదు. సినిమాల మీద సినిమాలు పోటీ పడిమరీ దూసుకొచ్చెస్తున్నాయి. ఎవరి సినిమా వాళ్ళకి గొప్ప. ఆ హీరోల అభిమానులకు ఫీవర్సే ఫీవర్స్. ఈ సారి సందడి చేయబోతున్న హీరోలు మామూలోళ్లు కాదు.. ఓ పక్కన విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు, మాస్ మహరాజ్ రవితేజ, కింగ్ నాగార్జున…..వీరితో పాటు యంగ్ జూనియర్ హీరో తేజా సజ్జా ఉన్నాడు. అన్ని సినిమాలకి విపరీతమైన క్రేజ్ వస్తుంది ఆ మధ్యలో ముమ్మరంగా ఇండస్ట్రీలో చర్చలు జరిగాయి. అదేంటంటే.. కొన్ని రిలీజ్ లు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని పెద్ద తలకాయలే తలలు పట్టుకున్నారు. కానీ ఎవ్వరూ తగ్గలేదు. కొంత బరువు హనుమాన్ సినిమా మీదే పడింది. వెనక్కి పంపించడానికి ప్రయత్నాలు బాగానే జరిగినా, హనుమాన్ టీం బాగానే ఒత్తిడిని తట్టుకుని నిలబడింది.
మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సినిమా గురించి కొన్ని కాంట్రవర్సీలు బైటకు రావడంతో కొంత అదనపు ఉత్కంఠ దీని గురించే ఏర్పడింది. చాలా సార్లు గొడవలు జరిగాయని సోషల్ మీడియా రాయడంతో గుంటూరు కారం అభిమానులను తీవ్రంగా రెచ్చగొట్టింది. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా అభిమానులు కూడా సోషల్ మీడియా వార్ లోకి వచ్చేశారు. వీటన్నిటికీ పక్కన బెడితే త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబో చాలా కాలం తర్వాత వస్తోంది. ఈ అంచనాలు అత్యధికంగా పూనకాలు తెప్పిస్తోంది. పైగా మమమ్మాస్ పాళ్ళు ఎక్కువగా కనబడడంతో గుంటూరు కారం ఘాటుగా బాగా ఎక్కేసింది. పాటలు, మహేష్ బాబు బీడీలు కాల్చడం, ఒకటి కాదు….అన్ని కోణాల్లో కారం గాలిలో ఎగిరెగిరి ఊపిరాడనివ్వడం లేదు. ఇంతకీ సినిమా ఎలా ఉంటుంది అన్నదే మెయిన్ టెన్షన్ అభిమానులకి, ఈ విషయం చిత్రనిర్మాత, మంచి మాటకారి నాగవంశీ ముందస్తుగానే తేరుకుని, ఎక్స్ ప్లాట్ ఫార్మ్ మీద అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చారు.
చూస్కోండి….మహేష్ బాబు తడాఖా అన్నట్టుగా చివరి 45 నిమిషాలు చూస్కోండి అని గట్టిగానే అభిమానులను ప్రిపేర్ చేస్తున్నారు. మహేష్ బాబు విషయంలో ఒక్క అభిమానులే కాదు, మామూలు ఆడియన్స్ కూడా సినిమా అంటే స్పెషల్ అటెన్షన్ కనబరుస్తారు. ఎక్సైట్ మెంట్ తో ఎదురుచూస్తారు. అందుకే నాగవంశీ చెప్పిన మాటలు, చివరి 45 నిమిషాలు అంటూ ఆయన నొక్కి చెప్పడంతో, ఏముందో అక్కడ, అదెలా ఉందో అన్నఉత్కంఠ అయితే ఊపందుకుంది. పైగా త్రివిక్రమ్ మట్టకు త్రివిక్రమ్, మహేష్ మట్టుకు మహేష్…ఇద్దరికిద్దరూ ఇంత ఊరమాస్ సినిమా ఇంతవరకూ చేయలేదు, ఇప్పుడీ ప్రయత్నం ఎలా విన్ అవుతుందో అనే ఆసక్తి మాత్రం అకాశమంత ఎత్తులో ఉంది.