iDreamPost
android-app
ios-app

Kurchi Tata: బంపరాఫర్ కొట్టేసిన కుర్చీ తాత.. త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్.. ఏమన్నాడంటే

  • Published Dec 30, 2023 | 9:45 AMUpdated Jan 04, 2024 | 5:34 PM

కుర్చీ మడతపెట్టి డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. తాజగా గుంటూరు సినిమాలో కూడా ఇదే డైలాగ్ మీద ఓ పాట కంపోజ్ చేశారు. దీనిపై స్పందిస్తూ.. కుర్చీ తాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

కుర్చీ మడతపెట్టి డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. తాజగా గుంటూరు సినిమాలో కూడా ఇదే డైలాగ్ మీద ఓ పాట కంపోజ్ చేశారు. దీనిపై స్పందిస్తూ.. కుర్చీ తాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Dec 30, 2023 | 9:45 AMUpdated Jan 04, 2024 | 5:34 PM
Kurchi Tata: బంపరాఫర్ కొట్టేసిన కుర్చీ తాత.. త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్.. ఏమన్నాడంటే

సోషల్ మీడియా వినియోగం తర్వాత రాత్రికి రాత్రే కొందరు సెలబ్రిటీలుగా మారుతున్నారు. అలా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న వ్యక్తి కుర్చీ తాత. ఈయన అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. తాతను యాటిట్యూడ్ కా బాప్ అనవచ్చు. సినిమా డైలాగ్ లకు మించి ఉంటాయి తాత మాటలు. అలా తాత చెప్పిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ డైలాగ్. ఎంతలా ఫేమస్ అయ్యిందంటే.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఈ డైలాగ్ ను.. పాటలా వాడుకున్నారు. శుక్రవారం నాడు కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమోను విడుదల చేయగా.. అది వైరల్ అవుతోంది.

తాజగా కుర్చీ తాత.. ఈ సాంగ్ పై రియాక్ట్ అవుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు లాంటి గొప్ప నటుడు తన డైలాగ్ ను వాడుకోవడం నిజంగా తన అదృష్టం అన్నాడు. అవకాశం వస్తే పాటలో ఒక్క చరణానికి అయినా డ్యాన్స్ వేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనను పిలిచి.. కుర్చీ మడతపెట్టి డైలాగ్ ను వాడుకుంటున్నాని తెలపడమే కాక.. ఓ బైట్ కూడా తీసుకున్నాడని వివరించాడు. అంతేకాక తనకు ఆర్థిక సాయం కూడా చేశారని చెప్పుకొచ్చాడు.

మరి సినిమాలో నటించే అవకాశం లభించిందా అంటే.. గుంటూరు కారం సినిమాలోనే తనకు ఛాన్స్ ఇచ్చారని.. కానీ అదే సమయంలో తాను కనపడకుండా పోవడంతో.. గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు. అయితే త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తనకు అవకాశం ఇస్తాడని కుర్చీ తాత చెప్పుకొచ్చాడు. గురూజీ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున సినిమాలో తాను కచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చాడు. అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను అన్నాడు.

తాత మాటలు విన్న వారు, అతడి అభిమానులు కూడా కుర్చీ తాతకు.. ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరి కుర్చీ తాతకు సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయో లేవో చూడాలి. కుర్చీ సాంగ్ మొత్తం రిలీజ్ అయ్యాక ఇంక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు మహేష్ బాబు అభిమానులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి