ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజు జరగాల్సిన తొలి డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ధర్మశాల పరిసరాల్లో ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో కనీసం టాస్ కూడా వెయ్యకుండానే మ్యాచ్ రద్దు అవటంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు.మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక గంటసేపు వర్షం ఆగడంతో మ్యాచ్ ప్రారంభించేందుకు చిత్తడిగా మారిన మైదానాన్ని అనువుగా సిద్ధం చేసేందుకు సిబ్బంది శ్రమించారు. కానీ గంట తర్వాత మళ్లీ మొదలైన వర్షం […]
మాంగానుయ్లోని బే ఓవల్ వేదికపై జరిగిన చివరి మూడో వన్డేలో భారత్ పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ ను క్లీన్‌స్వీప్ చేసింది. టీ20ల్లో 5-0 తేడాతో టీమిండియా చేతిలో వైట్‌వాష్ గురైన కివీస్ వన్డే సిరీస్ లో 3-0 తేడాతో భారత్ ను క్లీన్ షేవ్ చేసి బదులు తీర్చుకుంది.1989 తర్వాత తొలిసారిగా మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ గురై అప్రతిష్ఠ పాలయింది. జట్టుకు శుభారంభం అందించిన కివీస్ ఓపెనర్లు: 297 […]
న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ను 5-0 తో వైట్ వాష్ చేసిన భారత్ మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం కివీస్ తో తొలి వన్డే మ్యాచ్‌లో తలపడనున్నది. హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికపై భారత్,న్యూజిలాండ్‌ల మధ్య మొదటి వన్డే జరుగుతుంది.భారత రెగ్యులర్ ఓపెనర్లు శిఖర్ ధావన్,రోహిత్ శర్మ గాయాలతో జట్టు నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే. వన్డేలలో పృథ్వీ షా,మయాంక్ అగర్వాల్ అరంగేట్రం: సీనియర్ ఓపెనింగ్ జంట గైర్హాజరుతో టెస్టు క్రికెట్ […]
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ బుధవారం నుండి ప్రారంభం కాబోతున్న సమయంలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కివీస్ పర్యటన నుంచి కాలి పిక్క గాయంతో జట్టు నుండి వైదొలిగాడు. ఆదివారం కివీస్ తో జరిగిన చివరి టీ20లో 60 పరుగులు చేసిన రోహిత్ బ్యాటింగ్ చేస్తూ కాలి కండరాలు పట్టేయడంతో నొప్పి భరించలేక రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అనంతరం అతడు న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఈ మ్యాచ్‌కు […]
2008 నుంచి ఎనిమిదిసార్లు సూపర్ ఓవర్లో విజయం కోసం ఆడిన న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లో మినహా అన్నింటిలోనూ ఓడిపోయింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ 2010లో ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియాపై సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలిసారిగా 2008లో విండీస్‌తో ఆక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికపై జరిగిన టీ20లో సూపర్ ఓవర్లో ఓటమి పాలైన కివీస్,2012లో శ్రీలంకతో పల్లెకెలె స్టేడియంలో విండీస్‌తో జరిగిన రెండు టీ20లోను సూపర్ ఓవర్లలోనే ఓటమి పాలైంది.2019లో లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచ […]
న్యూజిలాండ్ గడ్డపై రెండు టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఐదు టీ20ల సిరీస్‌ని 3-0 తో చేజిక్కించుకున్న భారత్ శుక్రవారం వెల్లింగ్టన్ వేదికపై జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌లో మరోసారి న్యూజిలాండ్ తో తలపడనుంది.తొలిసారి కివీస్ పై టీ20 సిరీస్ గెలిచిన భారత్ జట్టు రిజర్వ్ బెంచ్ యువ ఆటగాళ్లను పరీక్షించటానికి సిద్ధమవుతోంది.ఈ మ్యాచ్‌కి భారత్ తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో మహమ్మద్ షమీ అద్భుత బౌలింగ్ […]
న్యూజిలాండ్ భారత్ ల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో టీ 20 లో భారత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కి దిగిన భారత్ రోహిత్ శర్మ(40 బంతుల్లో 65), విరాట్ కోహ్లీ(27 బంతుల్లో 38), లోకేష్ రాహుల్(19 బంతుల్లో 27) రాణించడంతో 179 పరుగులు సాధించింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ మూడు వికెట్లుసాధించగా, గ్రాండ్‌హోమ్, సాట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ విలియమ్సన్(48 బంతుల్లో 95),గుప్తిల్(21 […]
రేపు హామిల్టన్ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.తొలి రెండు టీ20లలో విజయం సాధించి జోరుమీదున్న భారత్ ను అడ్డుకోవడానికి న్యూజిలాండ్ వ్యూహాలు రచిస్తోంది.ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి న్యూజిలాండ్ పై సిరీస్ గెలవాలని కోహ్లీ సేన భావిస్తుంది. రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ని చేజిక్కించుకొని ప్రపంచ కప్పు సన్నాహకలలో భాగంగా రిజర్వు బెంచ్ లోని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించి పరీక్షించాలనుకుంటుంది. టీమిండియా ఓపెనర్ రోహిత్ మినహా బ్యాట్స్‌మెన్ […]