iDreamPost
android-app
ios-app

నేపాల్ క్రికెటర్ సంచలనం.. రోహిత్ రికార్డును బ్రేక్ చేస్తూ ఫాస్టెస్ట్ హండ్రెడ్!

  • Author singhj Published - 12:01 PM, Wed - 27 September 23
  • Author singhj Published - 12:01 PM, Wed - 27 September 23
నేపాల్ క్రికెటర్ సంచలనం.. రోహిత్ రికార్డును బ్రేక్ చేస్తూ ఫాస్టెస్ట్ హండ్రెడ్!

ఆసియా గేమ్స్-2023 గత శనివారం చైనాలోని హాంగ్జౌ వేదికగా గ్రాండ్​గా ఆరంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు డ్రాగన్ కంట్రీ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నమెంట్​లో ఈసారి క్రికెట్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. మెన్స్​తో పాటు విమెన్ క్రికెట్ టీమ్స్ కూడా టోర్నీలో ఆడటం విశేషమనే చెప్పాలి. అంతేగాక క్రికెట్​లో పలు అరుదైన రికార్డులు ఆసియా గేమ్స్​లో నమోదవుతున్నాయి. నేపాల్​-మంగోలియాకు మధ్య జరిగిన మ్యాచ్​లో ఏకంగా 3 రికార్డులు బద్దలయ్యాయి. అందులో ఒకటి టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్​లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా సంచలన ఇన్నింగ్స్​తో మెరిశాడు. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా 50 బంతులు ఆడిన అతడు.. 137 రన్స్ చేశాడు.

కుశాల్ మల్లా ఇన్నింగ్స్​లో 8 ఫోర్లు, 12 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్​లో తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్క్​ను అందుకొని చరిత్ర సృష్టించాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును కుశాల్ మల్లా బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్​లో అతడితో పాటు మరో బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఆరీ (10 బంతుల్లో 52 పరుగులు) కూడా చెలరేగి ఆడాడు.

దీపేంద్ర సింగ్ ఆరీ మంగోలియా బౌలర్లను ఉతికి ఆరేశాడు. 9 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్న అతడు.. టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేశాడు. కుశాల్ మల్లా, దీపేంద్రలు బ్యాటుతో విధ్వంసం సృష్టించడంతో నేపాల్ 314 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఛేజింగ్​లో మంగోలియా కేవలం 41 రన్స్​కే కుప్పకూలింది. దీంతో టీ20 క్రికెట్​లో నేపాల్ చరిత్ర సృష్టిస్తూ.. ఏకంగా 273 రన్స్ భారీ తేడాతో విక్టరీ కొట్టింది. నేపాల్-మంగోలియా మ్యాచ్​లో నమోదైన రికార్డులను చూస్తే.. 34 బంతుల్లోనే సెంచరీ, 9 బంతుల్లో ఫిఫ్టీ, వరుసగా 6 సిక్సులు, టీ20 క్రికెట్ హిస్టరీలో హయ్యెస్ట్ స్కోరు, పొట్టి ఫార్మాట్​లో భారీ విజయం నమోదయ్యాయి. మరి.. ఈ మ్యాచ్​లో నేపాల్ పెర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ కాదు.. ఈ వరల్డ్ కప్​లో అతడే టాప్ స్కోరర్: డివిలియర్స్