iDreamPost
android-app
ios-app

వీడియో: క్రికెట్​లో ఇలాంటి డిస్మిసల్ ఎప్పుడూ చూసుండరు.. అన్​లక్కీ బ్యాటర్!

  • Published Jul 17, 2024 | 3:17 PMUpdated Jul 17, 2024 | 3:17 PM

Unlucky Dismissal: క్రికెట్​లో అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో ఫన్నీ ఇన్నిడెంట్స్ చోటుచేసుకోవడం కామన్.

Unlucky Dismissal: క్రికెట్​లో అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో ఫన్నీ ఇన్నిడెంట్స్ చోటుచేసుకోవడం కామన్.

  • Published Jul 17, 2024 | 3:17 PMUpdated Jul 17, 2024 | 3:17 PM
వీడియో: క్రికెట్​లో ఇలాంటి డిస్మిసల్ ఎప్పుడూ చూసుండరు.. అన్​లక్కీ బ్యాటర్!

క్రికెట్​లో అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో ఫన్నీ ఇన్నిడెంట్స్ చోటుచేసుకోవడం కామనే. పాకిస్థాన్ క్రికెట్​లో ఇవి ఎక్కువగా చూస్తుంటాం. చెత్త ఫీల్డింగ్​కు పేరు గాంచిన ఆ జట్టు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. చేతిలోకి వచ్చిన క్యాచ్​ను నేలపాలు చేయడం, ఈజీ బౌండరీని వదిలేయడం వాళ్లకు అలవాటు. అందుకే ఫన్నీ ఫీల్డింగ్ అనగానే పాక్ ఆటగాళ్లే అందరికీ గుర్తుకొస్తారు. అయితే ఇలాంటి ఘటనల్లో బ్యాటర్లు బతికిపోతారు. కానీ మంచి ఫీల్డింగ్ వల్ల లేదా బ్యాడ్ లక్ వల్ల బ్యాటర్లు పెవిలియన్​కు చేరిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఊహించని రీతిలో ఔటై క్రీజును వీడిన బ్యాటర్లు ఉన్నారు.

క్రికెట్​లో మరో అన్​లక్కీ డిస్మిసల్ చోటుచేసుకుంది. ఏ టోర్నమెంట్​లో ఇది జరిగిందో తెలియదు గానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. మిడ్ వికెట్​పై బౌలర్ వేసిన బంతిని స్ట్రయిట్ బౌండరీ వైపు కొట్టేందుకు బ్యాటర్ ప్రయత్నించాడు. అయితే అది కాస్తా వెళ్లి నాన్​ స్ట్రయికర్​కు తగిలింది. బాల్ తన వైపే వస్తోందని గ్రహించిన నాన్​ స్ట్రయికర్ దాని బారి నుంచి తప్పించుకునేందుకు కిందకు వంగాడు. కానీ వేగంగా దూసుకొచ్చిన బంతి అతడి భుజానికి బలంగా తాకి బౌన్స్ అయింది. నాన్​ స్ట్రయికర్​ను తాకి గాల్లోకి లేచిన బంతి కాస్తా వచ్చి బౌలర్ చేతుల్లో పడింది. దీంతో బ్యాటర్ సహా నాన్ స్ట్రయికర్ కూడా షాకయ్యాడు. ఏం జరిగిందో తెలియక బిత్తరపోయాడు.

తాను కావాలని చేయలేదంటూ నాన్ స్ట్రయికర్ సారీ చెప్పడంతో.. ఓకే అంటూ నిరాశతో బ్యాటర్ క్రీజును వీడాడు. అదృష్టం కలిసొచ్చి వికెట్ దొరకడంతో బౌలింగ్ టీమ్ సంబురాలు చేసుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్స్ ఇంతకంటే అన్​లక్కీ డిస్మిసల్ క్రికెట్​లో మరొకటి ఉండదని అంటున్నారు. పాపం.. బ్యాటర్ దురదృష్టవంతుడని కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ప్లాన్ చేసినట్లు నాన్ స్ట్రయికర్​కు తగిలి నేరుగా బౌలర్ చేతుల్లో బాల్ వాలిపోవడం ఏంటని వాళ్లు కూడా షాక్ అవుతున్నారు. బ్యాటర్లు ఫన్నీగా ఔట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయని.. బ్యాడ్ లక్ వల్ల పెవిలియన్​కు చేరిన వాళ్లు కూడా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఇది మాత్రం మోస్ట్ అన్​లక్కీయెస్ట్ డిస్మిసల్ అని కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి