iDreamPost
android-app
ios-app

న్యూజిలాండ్‌కు విషాదం మిగులుస్తున్న సూపర్ ఓవర్‌

న్యూజిలాండ్‌కు విషాదం మిగులుస్తున్న సూపర్ ఓవర్‌

2008 నుంచి ఎనిమిదిసార్లు సూపర్ ఓవర్‌లో విజయం కోసం ఆడిన న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లో మినహా అన్నింటిలోనూ ఓడిపోయింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ 2010లో ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియాపై సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.

తొలిసారిగా 2008లో విండీస్‌తో ఆక్లాండ్‌ ఈడెన్ పార్క్ వేదికపై జరిగిన టీ20లో సూపర్ ఓవర్‌లో ఓటమి పాలైన కివీస్,2012లో శ్రీలంకతో పల్లెకెలె స్టేడియంలో విండీస్‌తో జరిగిన రెండు టీ20లోను సూపర్ ఓవర్లలోనే ఓటమి పాలైంది.2019లో లార్డ్స్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచ కప్పు ఫైనల్ మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు దారితీయగా అందులోనూ న్యూజిలాండ్ ఓడిపోయింది.2019లో ఆక్లాండ్ ఈడెన్ పార్క్ లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో కూడా సూపర్ ఓవర్లలోనే పరాజయం పాలైంది.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గత బుధవారం హామిల్టన్ సడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో సూపర్ ఓవర్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్, నేడు వెల్లింగ్టన్‌ స్టేడియంలో భారత్‌తో జరిగిన నాలుగో టీ20లోనూ మరోసారి సూపర్ ఓవర్‌లోనే పరాజయాన్ని చవిచూసింది.అయితే 2010లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో మాత్రమే గెలుపొందిన న్యూజిలాండ్‌కి మొత్తం మీద సూపర్ ఓవర్ కలిసి రావటం లేదు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Giriş