iDreamPost
android-app
ios-app

Virat Kohli: ఆల్​రౌండర్ ర్యాంకింగ్స్​లో జడేజా కంటే ముందున్న కోహ్లీ! ఇదెలా సాధ్యం?

  • Published Jul 05, 2024 | 10:20 PM Updated Updated Jul 05, 2024 | 10:20 PM

రికార్డుల రారాజుగా పేరు గడించాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కెరీర్​లో అతడు సాధించని రికార్డు లేదు. ఎన్నో అరుదైన ఘనతల్ని తన పేరు లిఖించుకున్నాడీ మోడర్న్ మాస్టర్.

రికార్డుల రారాజుగా పేరు గడించాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కెరీర్​లో అతడు సాధించని రికార్డు లేదు. ఎన్నో అరుదైన ఘనతల్ని తన పేరు లిఖించుకున్నాడీ మోడర్న్ మాస్టర్.

  • Published Jul 05, 2024 | 10:20 PMUpdated Jul 05, 2024 | 10:20 PM
Virat Kohli: ఆల్​రౌండర్ ర్యాంకింగ్స్​లో జడేజా కంటే ముందున్న కోహ్లీ! ఇదెలా సాధ్యం?

రికార్డుల రారాజుగా పేరు గడించాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కెరీర్​లో అతడు సాధించని రికార్డు లేదు. ఎన్నో అరుదైన ఘనతల్ని తన పేరు లిఖించుకున్నాడీ మోడర్న్ మాస్టర్. 15 ఏళ్లకు పైగా కెరీర్​లో భారీగా పరుగుల వరద పారించిన కోహ్లీ.. ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అనే తేడాల్లేకుండా అన్నింటా సమానంగా ఆడాడు. బరిలోకి దిగింది మొదలు బ్యాట్​తో ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ వచ్చాడు. టీ20 వరల్డ్ కప్-2024లో అతడు ఇదే విధంగా ఆడాడు. టోర్నీ మొత్తం ఫెయిలైనా ఫైనల్​లో మ్యాచ్ విన్నింగ్ నాక్​తో టీమ్​ను విజయతీరాలకు చేర్చాడు. సూపర్బ్ నాక్​తో టీమ్ కప్పు అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రపంచ కప్ ఫైనల్​తో అతడి టీ20 కెరీర్ ముగిసింది.

వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత టీ20 కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు కోహ్లీ. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇక మీదట ఈ త్రయం వన్డేలు, టెస్టుల్లోనే కనిపించనున్నారు. దీంతో అభిమానుంతా నిరాశలో కూరుకుపోయారు. ఒకవైపు ప్రపంచ కప్ గెలిచామనే సంతోషం ఉన్నా.. మరోవైపు లెజెండరీ ప్లేయర్లు ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ఆల్​రౌండర్స్ ర్యాంకులను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా అందులో జడేజా కంటే కోహ్లీ ముందంజలో ఉన్నాడు. దీంతో ఇదెలా సాధ్యమంటూ క్రికెట్ లవర్స్ షాకవుతున్నారు.

ఐసీసీ తాజాగా ప్రకటించిన ఆల్​రౌండర్స్ ర్యాంకింగ్స్​లో విరాట్ కోహ్లీ 79వ స్థానంలో నిలిచాడు. అదే రవీంద్ర జడేజా 86వ ర్యాంక్​ను దక్కించుకున్నాడు. కోహ్లీ తన టీ20 కెరీర్​లో ఓవరాల్​గా 125 మ్యాచులు ఆడాడు. అయితే అందులో 13 మ్యాచుల్లో మాత్రమే అతడు బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. అటు జడేజా ఓవరాల్​గా 74 మ్యాచులు ఆడగా.. 71 మ్యాచుల్లో బౌలింగ్ చేశాడు. అతడు 54 వికెట్లు పడగొట్టాడు. ఈ టీ20 వరల్డ్ కప్​లో కోహ్లీ బౌలింగ్​కు దిగలేదు. అదే జడ్డూ బౌలింగ్ వేయడమే గాక 1 వికెట్ పడగొట్టాడు. అయినా ఆల్​రౌండర్ ర్యాంకింగ్స్​లో జడేజా కంటే కోహ్లీనే మెరుగైన ర్యాంక్ సాధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐసీసీ ఏ ప్రాతిపదికన ఇలా ర్యాంకులు ప్రకటించిందో తెలియదు గానీ అభిమానులు మాత్రం దీని గురించి బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. మరి.. ఆల్​రౌండర్ ర్యాంకింగ్స్​లో జడ్డూ కంటే కోహ్లీనే టాప్​లో ఫినిష్ చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.