iDreamPost
android-app
ios-app

రెచ్చిపోయిన రోహిత్ – t20 సిరీస్ గెలిచిన భారత్

రెచ్చిపోయిన రోహిత్ – t20 సిరీస్ గెలిచిన భారత్

న్యూజిలాండ్ భారత్ ల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో టీ 20 లో భారత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కి దిగిన భారత్ రోహిత్ శర్మ(40 బంతుల్లో 65), విరాట్ కోహ్లీ(27 బంతుల్లో 38), లోకేష్ రాహుల్(19 బంతుల్లో 27) రాణించడంతో 179 పరుగులు సాధించింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ మూడు వికెట్లుసాధించగా, గ్రాండ్‌హోమ్, సాట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.

180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ విలియమ్సన్(48 బంతుల్లో 95),గుప్తిల్(21 బంతుల్లో 31) రాణించడంతో లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ముఖ్యంగా విలియమ్సన్ ధాటికి భారత్ ఓడిపోతుందేమో అనిపించింది. కానీ విలియమ్సన్ & రాస్ టేలర్ ను షమీ అవుట్ చేయడంతో మ్యాచ్ టై గా ముగిసింది. చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైన స్థితిలో రాస్ టేలర్ ను షమీ అవుట్ చేయడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. భారత బౌలర్లలో ఠాకూర్, షమి రెండేసి వికెట్లు తీసుకోగా.. చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.

దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు సాధించింది. విలియమ్సన్ మరోసారి మెరిశాడు. భారత్ తరపున బుమ్రా సూపర్ ఓవర్ లో బౌలింగ్ చేయగా గుప్తిల్,విలియమ్సన్ బ్యాటింగ్ చేసారు.

అనంతరం లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ బ్యాటింగ్ కు దిగి 20 పరుగులు సాధించడంతో విజయం సాధించింది. విజయానికి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన దశలో రెండు సిక్సులు కొట్టడం ద్వారా భారత్ ను రోహిత్ శర్మ విజయ తీరాలకు చేర్చాడు.

భారత్ ను విజయ తీరాలకు చేర్చిన రోహిత్ శర్మకు మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.. దీంతో 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తో మరో రెండు మ్యాచులు మిగిలుండగానే కైవసం చేసుకుంది.