రైలు ప్రయాణాల కోసం ఐఆర్సీటీసీ వంటి యాప్ లు లేదా ఇతర ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేస్తూ ఉంటాం. ప్రయాణంలో బెర్తు ఖరారైతే ఫర్వాలేదు కానీ, ఆర్ఎసీ వచ్చినప్పుడే అసలు కంగారు మొదలవుతుంది. ప్రయాణీకుల్లో ఈ ఆందోళనను తొలగించేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రైలు ప్రయాణాల్లో ఆర్ఏసీ వచ్చినా బెర్తుల కేటాయింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టింది దక్షిణ మధ్య రైల్వే. మొత్తం కేటాయింపులను ఆన్ లైన్ కు మార్చింది. దీని ద్వారా […]
రైల్వే రిజర్వేషన్ లో RAC వచ్చిందా ఇక అంతే సంగతులు! చివరి నిముషం వరకు ఎవరి సీట్ క్యాన్సిల్ అవుతుందో, ఎక్కడ సీటొస్తుందో, అసలు వస్తుందో రాదో అన్న టెన్షన్ లో టీసీల చుట్టూ తిరుగుతుంటారు ప్రయాణికులు. రిజర్వేషన్ వివరాలు, క్యాన్సిలేషన్ వివరాలు టీసీలకు తప్ప మిగతా వాళ్ళకు తెలిసే అవకాశముండదు. వాళ్ళ కేటాయింపులే ఫైనల్. ముందు నుంచి లిస్టులో ఉన్నవాళ్ళను పక్కనపెట్టేసి డబ్బిచ్చిన వాళ్ళకు సీట్లిచ్చినా అడిగేవాళ్ళుండరు. ఇకపై ఇలాంటి అవకతవకలకు తావుండదు. కారణం- దక్షిణ […]