iDreamPost
android-app
ios-app

రైల్వే ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్.. జనరల్ బోగీలు పెంపు!

South Central Railway News: రైలు ప్రయాణం చేసే వారికి జనరల్ బోగీల్లో ఉండే పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ సంఖ్యలో జనరల్ బోగీలు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే శాఖ సహాయ మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు.

South Central Railway News: రైలు ప్రయాణం చేసే వారికి జనరల్ బోగీల్లో ఉండే పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ సంఖ్యలో జనరల్ బోగీలు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే శాఖ సహాయ మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు.

రైల్వే ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్.. జనరల్ బోగీలు పెంపు!

చాలా మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. మిగిలిన వాటితో పోలీస్తే.. ట్రైన్ టికెట్ ధరలు కాస్తా తక్కువగా ఉంటాయి. ప్రయాణికులు రైలు జర్నీ చేయడానికి ఇది ఒక కారణం. అయితే ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ వంటి వివిధ రకాల ట్రైన్స్ లో జనరల్ బోగీలు చాలా తక్కువగా ఉంటాయి. ట్రైన్ ఇరువుపై అతి తక్కువగా జనరల్ బోగీలు ఉంటాయి. దీంతో వాటిల్లోనే ఇరుక్కుని మరీ  సాధారణ ప్రయాణికులు జర్నీ చేస్తుంటారు. కొన్ని సార్లు జనరల్ బోగీలు ప్రయాణం నరకంగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో రైల్వే ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రన్విత్ సింగ్ శనివారం హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సౌత్ సెంట్రలో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్  జైన్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  రైళ్లలో జనరల్ బోగీల పెంపుపై కేంద్ర మంత్రి రన్విత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  టైన్స్ లో దశల వారీగా జనరల్ బోగీల సంఖ్యను పెంచుతామని, ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గిస్తామని ఆయన తెలిపారు. అలానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు.

రూ. 700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు చేపడుతున్నామని, 2026 కల్లా పనులు మొత్తం పూర్తి కావాలని టార్గెట్ గా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 27 శాతం పనులు పూర్తైయ్యాయని ఆయన తెలిపారు. అదే విధంగా చర్లపల్లి  స్టేషన్ పనులు వేగంగా పూర్తయ్యాయని, త్వరలో ఆ స్టేషన్ ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ లో కొత్త ప్లాట్ ఫామ్స్, లిఫ్టులు, వైయిటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

అమృత్ భారత్ స్టేషన్‎లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న  119  రైల్వే స్టేషన్లను 5000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సూచించారని, అందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ది చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తంగా శనివారం సికింద్రబాద్ రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన కేంద్ర మంత్రి రైల్వే ప్రయాణికులు ఓ గుడ్ న్యూస్ అందించారు. జనరల్ బోగీల సంఖ్యను పెంచితే.. చాలా మంది ప్రయాణికులకు ఊరట లభించినట్లు అవుతుంది. మరి..కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.