iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

South Central Railway: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ నిర్ణయంతో ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి.

South Central Railway: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ నిర్ణయంతో ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి.

తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

రోజు రోజుకు రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. సుధూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణానికే ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికి ఆదరణ పెరుగుతోంది. పండుగలు, ఇతర వేడుకలప్పుడు అన్ని రూట్లలో రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. ఇక జనరల్ బోగీలైలే ఎప్పుడు చూసిన రద్దీగా ఉంటాయి. ఎంతదూరమైనా నిల్చోని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో సాధారణ ప్రయాణికులకు రైలు ప్రయాణం ఇబ్బందిగా మారుతోంది. జనరల్ బోగీలను పెంచాలని రైల్వే శాఖను కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీ రైలు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నడిచే 12 ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సింహపురి, ఫలక్ నుమా, గోదావరి, గౌతమి, చార్మినార్, కొకనాడ, విశాఖ, కొండవీడు, భాగ్యనగర్-కాకినాడ, కాకినాడ-షిర్డీ, కాకినాడ-ఎల్టీటీ రైళ్లకు 2 అదనపు జనరల్ బోగీలు, మచిలీపట్నం-ధర్మవరం రైలుకు ఒక బోగీని పెంచుతున్నట్లు తెలిపింది. ఈ ట్రైన్లలో ఇప్పటికే రెండు జనరల్ బోగీలు ఉండగా నవంబర్ నుంచి 4 కోచ్ లతో ఇవి నడవనున్నాయి. ఎస్సీఆర్ నిర్ణయంతో రైలు ప్రయాణికులకు ఊరట లభించనున్నది.

హాలిడేస్, ఫెస్టివల్స్ వంటి రోజుల్లో రైళ్ల సంఖ్యను పెంచినప్పటికీ సరిపోవడం లేదు. వందలాది రైళ్లు ఇరు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నప్పటికీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ కు వలస వచ్చిన వారు వివిధ అవసరాల రీత్య సోంతూళ్లకు వెళ్తుంటారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ కు తరలి వస్తుండడంతో ట్రైన్లలో రద్దీ మరింత పెరుగుతున్నది. జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్స్ ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి