iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. 13 రైళ్ల దారి మళ్లింపు!

  • Published Aug 22, 2024 | 6:20 PM Updated Updated Aug 22, 2024 | 6:20 PM

Andhra Pradesh Trains News: సౌత్ సెంట్రల్ రైల్వే తరచూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తునే ఉంటుంది. తాజాగా 13 రైళ్లకు సంబంధించి ఓ కీలక సమచారం వచ్చింది. వివిధ రైల్వే పనుల కారణంగా 13 రైళ్లను దారి మళ్లించారు.

Andhra Pradesh Trains News: సౌత్ సెంట్రల్ రైల్వే తరచూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తునే ఉంటుంది. తాజాగా 13 రైళ్లకు సంబంధించి ఓ కీలక సమచారం వచ్చింది. వివిధ రైల్వే పనుల కారణంగా 13 రైళ్లను దారి మళ్లించారు.

  • Published Aug 22, 2024 | 6:20 PMUpdated Aug 22, 2024 | 6:20 PM
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. 13 రైళ్ల దారి మళ్లింపు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎంతో మంది రైళ్ల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. టికెట్ ధర తక్కువగా ఉండటంతో  ఎక్కువ మంది ట్రైన్స్ లో జర్నీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే రైల్వే శాఖ ట్రైన్ సమయపాలన, వాటికి సంబంధించిన ఇతర వివరాలను తరచూ తెలియజేస్తుంది. అంతేకాక రైళ్లు రద్దు, మళ్లీంపు వంటి విషయాలను ముందుగానే చెప్తూ ప్రయాణికులను అలెర్ట్ చేస్తుంది. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ కీలక సమచారం ఇచ్చారు. 13 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దక్షిణ మధ్య రైల్వేలో ప్రధానమైన రైల్వే డివిజన్ విజయవాడ డివిజన్‌. ఈ ప్రాంతం మీదు నిత్యం అనేక ట్రైన్లు ప్రయాణిస్తుంటాయి. తాజాగా ఈ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా 10 రైళ్లు దారి మళ్లించిన మార్గంలో నడిపిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు. ఎక్కువ ట్రైన్లు వెళ్లే విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బ‌దులు విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా పంపిస్తున్నారు. అదే విధంగా ఉత్తరాన ఉన్న పల్వాల్-న్యూ ప్రిథ్లా యార్డ్ మధ్య రైలు కనెక్టివిటీకి సంబంధించి పాల్వాల్ స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్ పని కారణంగా మరో మూడు ట్రైన్లను దారి మళ్లించిన మార్గంలో నడిపిస్తున్నారు.

పూజ సీజ‌న్ నేప‌థ్యంలో సంబల్‌పూర్-ఈరోడ్ మ‌ధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే వాల్తేర్ డివిజన్‌లో భ‌ద్ర‌తా పనుల కారణంగా రెండు ట్రైన్లను రీషెడ్యూల్ చేశారు. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ (20805, 20806) రైళ్లు సెప్టెంబ‌ర్ 4 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు దారి మళ్లించారు. ఈ ట్రైన్ ఆగ్రా కాంట్-మితావాలి-ఘజియాబాద్-న్యూఢిల్లీ మీదుగా మళ్లించబడుతుంది. అలానే విశాఖపట్నం-అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807) రైళ్లు కూడా సెప్టెంబ‌ర్ 6, 7, 10, 13, 14 తేదీల్లో ఆగ్రా కాంట్, మితావాలి, ఘజియాబాద్ మీదుగా న్యూఢిల్లీ మళ్లిస్తారు. సెప్టెంబ‌ర్ నెల‌లో మూడు రైళ్లు విజయవాడ, ఏలూరు, నిడదవోలుకు మార్గానికి బ‌దులుగా వేరే రూట్లో వెళ్లనున్నాయి. విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా నడవనున్నాయి.

ఎర్నాకులం-పాట్నా సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22643) రైలు సెప్టెంబ‌ర్ 2 నుంచి సెప్టెంబ‌ర్‌ 23 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఎస్ఎంవీ బెంగళూరు-గౌహతి సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12509) రైలు వచ్చే నెల 4 నుంచి 27వ తేదీ వరకు దారి మళ్లించిన మార్గంలో ప్రయాణించనుంది. సీఎస్‌టీ ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు (11019)  వచ్చే నెల 2 నుంచి 29వ తేదీ వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడవనుంది. అదే విధంగా వాల్తేర్‌ డివిజన్‌లోని పుండి-నౌపడ- పుండి, తిలారు-కోటబొమ్మాళి సెక్షన్‌లలో  రైల్వే ట్రాక్ లు, ఇతర భ‌ద్ర‌తా పనుల దృష్ట్యా ఆగస్టు 23 తేదీలో పలు రైళ్ల టైమింగ్ లో మార్పులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కేఎస్ఆర్‌ బెంగళూరు – భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) రైలును రీషెడ్యూల్ చేశారు. మొత్తంగా ఈ మార్గాల్లో ప్రయాణం  చేసేందుకు సిద్ధమైన వారు.. టైన్స్ కి సబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని జర్నీ ప్లాన్ చేసుకోవడం మంచింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio