iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు అలర్ట్‌.. Hyderabad నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

  • Published Aug 21, 2024 | 11:12 AM Updated Updated Aug 21, 2024 | 11:12 AM

TG SCR Cancelled Few Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. హైదరాబాద్‌ నుంచి వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తూ.. అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

TG SCR Cancelled Few Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. హైదరాబాద్‌ నుంచి వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తూ.. అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

  • Published Aug 21, 2024 | 11:12 AMUpdated Aug 21, 2024 | 11:12 AM
ప్రయాణికులకు అలర్ట్‌.. Hyderabad నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేల మంది ప్రయాణం చేస్తుంటారు. ఇందుకు తగ్గట్టుగానే దక్షిణ మధ్య రైల్వే.. ట్రైన్స్‌ను ఏర్పాటు చేస్తుంటుంది. జంట నగరాల నుంచి వెళ్లే ప్రయాణికులతో ఈ రైళ్లన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. ప్రతి రోజుల వేలమంది ఈ ట్రైన్లలో ప్రయాణం చేస్తుంటారు. ఈ ‍క్రమంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్రైన్‌ జర్నీ చేసేవారికి కీలక అలర్ట్‌ జారీ చేశారు. నగరం నుంచి వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేశారు. మరి ఏ రైళ్లను రద్దు చేశారు.. ఎందుకంటే..

దక్షిణమధ్య రైల్వే అధికారులు నగరం నుంచి వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. కారణం.. సికింద్రాబాద్, హైదరాబాద్‌ రైల్వే డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో నిర్వహణ పనుల చేపట్టారు. అందుకే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్ల పూర్తి వివరాలను వెల్లడించారు. వరంగల్‌-హైదరాబాద్‌ మెమూ, కాజీపేట-బల్లార్ష, సికింద్రాబాద్‌-వరంగల్ ట్రైన్లను సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 30 వరకు క్యాన్సిల్ చేశారు.

Many trains from Hyderabad have been cancelled

అలానే బల్లార్ష-కాజీపేట ట్రైన్‌ను సెప్టెంబరు 2 నుంచి అక్టోబరు 1 వరకు రద్దు చేశారు. సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్, కరీంనగర్‌-బోధన్‌ మెమూ ట్రైన్లను సెప్టెంబరు 1-30 వరకు రద్దు చేశారు. బోధన్‌-కరీంనగర్‌ మెము ట్రైన్‌ను సెప్టెంబరు 2 నుంచి అక్టోబరు 1 వరకు రద్దు చేశారు. కాచిగూడ-నడికుడి, నడికుడి-కాచిగూడ రైళ్లను సెప్టెంబరు 1-30 వరకు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ మంగళవారం (ఆగస్టు 20) ఓ ప్రకటన విడుదల చేశారు. హెచ్‌ఎస్‌ నాందేడ్‌-రాయచూరు ట్రైన్ సెప్టెంబరు 1-30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

తాండూరు-రాయచూరు మధ్య ఈ ట్రైన్లు పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు. అలాగే భద్రాచలం రోడ్‌- బల్లార్ష, సిర్పూర్‌టౌన్‌-భద్రాచలం ట్రైన్లను సెప్టెంబరు 1-30 వరకు రద్దు చేశారు. అలానే కాజీపేట స్టేషన్‌లో స్టాపేజిని తొలగించినట్లు తెలిపారు. ట్రైన్ ప్రయాణికులు ఈ విషయాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.. నిర్వహణ పనుల తర్వాత ఈ రైళ్లన్ని యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు.

ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పుకు వ్యతిరేకంగా నేడు పలు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు చోట్ల ట్రైన్ ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ప్రయాణికులు దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.