iDreamPost
android-app
ios-app

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆ స్టేషన్లలో హాల్టింగ్ కొనసాగింపు!

  • Published Jul 18, 2024 | 12:16 PM Updated Updated Jul 18, 2024 | 12:16 PM

South Central Railway: రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులుక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే పలు స్టేషన్ లో స్టాప్ లను కొనసాగిస్తూ..కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో..

South Central Railway: రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులుక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే పలు స్టేషన్ లో స్టాప్ లను కొనసాగిస్తూ..కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో..

  • Published Jul 18, 2024 | 12:16 PMUpdated Jul 18, 2024 | 12:16 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఆ స్టేషన్లలో హాల్టింగ్ కొనసాగింపు!

మన దేశంలో ప్రధానమైన వ్యవస్థలో ఇండియన్ రైల్వే శాఖ ఒకటి. నిత్యం ఎంతో మంది వీటి ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. టికెట్ ధర కూడా అందుబాటులో ఉండటంతో రైలులో జర్నీ చేసేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక కొత్త కొత్త సదుపాయాలను కల్పిస్తు..వారి జర్నీని సులభతరం చేస్తుంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఏపీ, తెలంగాణ  రాష్ట్రాల్లో ప్రయాణించే  పలు రైళ్లకు  సంబంధించి…కొన్ని స్టేషన్లలో ఉన్న హల్టింగ్ ను కొనసాగిస్తు నిర్ణయం తీసుకున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ట్రైన్లు  నడుస్తుంటాయి. ఇదే సమయంలో కొన్ని మార్గాల్లో వెళ్లే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఆయా మార్గాల్లో రైళ్ల సంఖ్యను పెంచుతుంటారు. ఇదే సమయంలో కొన్ని సార్లు పలు రైళ్ల స్టాపుల విషయంలో కూడా రైల్వే అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.

గతంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏర్పాటు చేసిన కొన్ని స్టేషన్ల హాల్టింగ్ ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్థం ఈ పలు  ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాప్ లను కొనసాగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇందులో నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్  రైళ్లకు మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల్, స్టేషన్లలో హాల్టింగ్ ను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. నర్సాపూర్-లింగంపల్లి, చెన్నై-హైదరాబాద్, భువనేశ్వర్-సికింద్రబాద్ మధ్య నడిచే రైళ్లు నల్గొండలో ఆగనున్నాయి.

కోవిడ్ టైమ్ లో  రైల్వే బోర్డు అధికారులు నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లకు మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల స్టేషన్లలో నిలపకుండా ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పటి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రైల్వే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఫలితంగా ఏడాది పాటు ఈ రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపేందుకు అధికారులు అంగీకరించారు. అలా రైల్వేశాఖ ఇచ్చిన  ఏడాది సమయం ఈ నెల 19తో ముగియనుంది. ఈ క్రమంలోనే స్టేషన్ల స్టాప్ ను పునరుద్దరిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

అదే విధంగా తిరుపతి-సికింద్రాబాద్, విశాఖ-మహబూబ్ నగర్ మధ్య నడిచే రైళ్లకు మధీరలో స్టాఫ్ ను కొనసాగిస్తున్నారు. ముంబై ఎల్ టీటీ-కాకినాడ  మధ్య నడిచే రైళ్లు, తాడిపత్రి , గుత్తి స్టేషన్లలో ఆగనున్నాయి. ఇక పలు రైళ్లకు సంబంధించి..వివిధ స్టేషన్లలో హాల్టింగ్ ను కొనసాగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మరింత సమాచారం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి..దక్షిణ మధ్య రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet