iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు అలర్ట్.. నేడు, రేపు పలు రైళ్లు రద్దు

పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మీరు రైలు ప్రయాణం చేయాలనుకుంటే రద్దైన రైళ్ల వివరాలను ఇప్పుడే తెలుసుకోండి.

పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మీరు రైలు ప్రయాణం చేయాలనుకుంటే రద్దైన రైళ్ల వివరాలను ఇప్పుడే తెలుసుకోండి.

ప్రయాణికులకు అలర్ట్.. నేడు, రేపు పలు రైళ్లు రద్దు

నిత్యం వేలాది మంది రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. చిరుద్యోగులు, సాధారణ ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణం చేసేందుకే ఇంట్రస్టు చూపిస్తున్నారు. ఇక హైదారాబాద్ లో లోకల్ ట్రైన్ ల ద్వారా ఎంతో మందికి ప్రయాణ కష్టాలు తప్పాయి. బస్ ఛార్జీల కంటే తక్కువగా ఉండడంతో ఎంఎంటీఎస్ రైళ్ళలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే బిగ్ అలర్ట్ ఇచ్చింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఏయే రైళ్లు రద్దు అయ్యాయంటే?

నేడు, రేపు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఎంఎంటీఎస్, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఎస్సీఆర్ వెల్లడించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పనుల నేపథ్యంలో సికింద్రాబాద్-ఫలక్ నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్-మేడ్చల్ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్. రాకేశ్ తెలిపారు.

రైళ్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే హైదరాబాద్ లో 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ వృత్తులు చేసుకునే వారు, ఆఫీసులకు వెళ్లే వారు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణ కష్టాలు ఎదుర్కొంటున్నారు. వీలైనంత త్వరగా రైలు సర్సీసులను ప్రారంభించాలని కోరుతున్నారు. మరి మీరు రైలు ప్రయాణం చేయాలని అనుకుంటే మీరు ప్రయాణించే రూట్లలో ఏయే రైళ్లు రద్దయ్యాయో తెలుసుకుంటే ఇబ్బందులు పడకుండా ప్రయాణాలు సాగించవచ్చు.