నిన్న జరిగిన విశ్వక్ సేన్ హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సమర్పకుడుగా వ్యవహరించిన నాని వల్ల రాజమౌళి, అనుష్క, అల్లరి నరేష్, సందీప్ కిషన్, రానా లాంటి స్పెషల్ గెస్టులు రావడంతో వేడుక నిండుగా జరిగింది. గత కొంతకాలంగా మీడియా కంటికి దూరంగా ఉన్న అనుష్క చాన్నాళ్ల తర్వాత కెమెరా ముందు రావడంతో ముఖ్యంగా అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్టేజి మీద విల్లు ఎక్కుపెట్టి బాణం వదలడం లాంటివి చేయడంతో మంచి […]
ఏడాదిన్నర క్రితం వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత మరో కొత్త సినిమా లేక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా వెయిటింగ్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడి వచ్చే ఏడాదికి వెళ్లిపోవడంతో మొత్తం మీద రెండేళ్లకు పైగా నిరీక్షణ భరించక తప్పదని అర్థమైపోయింది. రాజమౌళి మూవీ కాబట్టి ఈ మాత్రం సర్దుబాట్లు తప్పవు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఎవరితో సినిమాలు చేస్తాడనే దాని మీద పూర్తి స్పష్టత రావడం లేదు […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక పాట, మూడు ఫైట్లతో పాటు కొంత టాకీ పార్ట్ పూర్తి చేశారు. హీరొయిన్ త్రిష(ఇంకా అధికారికంగా చెప్పలేదు) ఎంటర్ కాగానే ఇంకా స్పీడ్ పెరుగుతుందని ఇన్ సైడ్ టాక్. ఈ లెక్కన సరిలేరు నీకెవ్వరు వేడుకలో చిరు కోరినట్టు కొరటాల శివ అనుకున్న టైంలోనే మొత్తం పూర్తి చేసి ఫైనల్ కాపీ చేతికిచ్చేలా ఉన్నాడు. ఇదంతా బాగానే ఉంది […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో యమా బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్వంత బ్యానర్ లో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్న చిరు 152లో ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా తన సినిమా హీరో సెట్స్ లో ఉండగా ఇంకొకరికి అప్పజెప్పేందుకు ససేమిరా ఇష్టపడని జక్కన్న ఫైనల్ గా చరణ్ కు ఆకుపచ్చ జెండా ఊపినట్టు తెలిసింది. ప్రస్తుతానికి చరణ్ పాత్రకు సంబంధించి […]
ఏ హీరోకైనా బ్లాక్ బస్టర్స్ అనేవి చాలా స్పెషల్ మూమెంట్స్ గా నిలిచిపోతాయి. వాటి తాలుకు జ్ఞాపకాలు, రికార్డులు, పోటీ సినిమాలు తదితరాలు ఎప్పటికప్పుడు గుర్తుకువస్తూ ఉంటాయి. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ప్రత్యేకించి వేరే చెప్పాలా. అసలే తమ కథానాయకుడు రెండేళ్ళు తెరకు దూరమైపోతున్నాడని ఫ్యాన్స్ ఎంత కలవరపడుతున్నారో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కోసం అనుకున్న టైం కన్నా ఎక్కువే త్యాగం చేస్తున్న తారక్ ని రాజమౌళి ఇలా లాక్ చేయడం పట్ల కొంత అసంతృప్తి […]
కొద్దిరోజుల క్రితం ఐడ్రీమ్ అందించిన కథనం నిజమయ్యింది. రాజమౌళి ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ వచ్చే 2021 సంక్రాంతికి వాయిదా వేస్తూ జనవరి 8 రిలీజ్ డేట్ ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అన్ని అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లోనూ ఇదే ట్రెండింగ్ అవుతోంది. షూటింగ్ అనుకున్న టైంకి పూర్తి కాకపోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరం పడుతుంది కాబట్టి హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ చేయడం కంటే ఇదే మంచి […]
మొన్న ఏడాది చివర్లో సైలెంట్ గా రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న కెజిఎఫ్ ఇప్పుడు సీక్వెల్ రూపంలో ప్రేక్షకులను తెగ ఊరిస్తోంది. ఛాప్టర్ 2 పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే కర్నూలు, కడప ప్రాంతాల్లో కొన్ని ఎపిసోడ్లు షూట్ చేసిన యూనిట్ తర్వాత మైసూర్ అటుపై గనుల సెట్ లో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాస్తవానికి ఇది కూడా ఫస్ట్ పార్ట్ లాగే 2020 చివర్లో […]
రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల ముందు ప్రకటించినట్టుగా ఈ ఏడాది జులై 30న ఉండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఫిలిం నగర్ టాక్ ప్రకారం షూటింగ్ ఇంకా చాలా బాలన్స్ ఉందని, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎంత లేదన్నా అయిదారు నెలలు అవసరమని అలాంటప్పుడు జులై డెడ్ లైన్ మీట్ కావడం అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. దసరాకు అనుకున్నప్పటికీ ఇలాంటి విజువల్ వండర్ కి అది సరైన టైం కాదు. అందుకే జక్కన్న టీమ్ […]
టాలీవుడ్ కు లీకుల బెడద ఇప్పటిది కాదు. షూటింగ్ స్పాట్ నుంచి లీకవుతున్న వీడియో బిట్ల నుంచి మొత్తం సినిమానే ఆన్ లైన్ లో పెట్టె దాకా పరిశ్రమ ఎన్నో చూసింది. అత్తారింటికి దారేది. టాక్సీ వాలాలు రిలీజ్ కు ముందే పూర్తి సినిమాలు నెట్ లో ప్రత్యక్షం కావడం ఎవరూ మర్చిపోలేరు. స్పాట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి సైతం బాహుబలి టైంలో వీటి బారిన పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా దానికి […]
టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా… సునీల్ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన […]