Swetha
మొగలిరేకులు సీరియల్ తో తన కంటూ ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు ఆర్కే సాగర్ . ఆ సీరియల్ తర్వాత సినిమాలలో ఎంట్రీ ఇచ్చాడు కానీ అవి అంతగా వర్కౌట్ అయినట్టు లేదు. అయినాసరే సాగర్ ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు.
మొగలిరేకులు సీరియల్ తో తన కంటూ ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు ఆర్కే సాగర్ . ఆ సీరియల్ తర్వాత సినిమాలలో ఎంట్రీ ఇచ్చాడు కానీ అవి అంతగా వర్కౌట్ అయినట్టు లేదు. అయినాసరే సాగర్ ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు.
Swetha
మొగలిరేకులు సీరియల్ తో తన కంటూ ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు ఆర్కే సాగర్ . ఆ సీరియల్ తర్వాత సినిమాలలో ఎంట్రీ ఇచ్చాడు కానీ అవి అంతగా వర్కౌట్ అయినట్టు లేదు. అయినాసరే సాగర్ ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ‘ది 100’ అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జులై 11 న ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కూడా థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా. చాలా వరకు సినిమాలు థియేటర్ లో ఆడియన్స్ ను మెప్పించకపోయినా.. ఓటిటి లో మాత్రం ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి.
ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. నగరంలో ఓ గ్యాంగ్ దొంగతనాలు , వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని డ్యూటీలో జాయిన్ అవుతాడు విక్రాంత్ (ఆర్కె సాగర్ ). ఒడిశాకు చెందిన ఓ గ్యాంగ్ దీని వెనుక ఉన్నాడని తీసుకుంటాడు విక్రాంత్ . ఆ నిందితులను కూడా పట్టుకుంటాడు. కట్ చేస్తే అదే గ్యాంగ్ లో విక్రాంత్ ప్రేమించిన ఆర్తి కూడా ఉందని తెలుస్తుంది. అసలు ఆర్తి కి ఆ గ్యాంగ్ కు సంబంధం ఏంటి ? ఆ తర్వాత ఏమి జరిగింది ? ఆ హత్యలు చేసేది ఎవరు ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ వీకెండ్ ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.