iDreamPost
android-app
ios-app

అసలు నాగ్ అశ్విన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ?

  • Published Aug 26, 2025 | 12:22 PM Updated Updated Aug 26, 2025 | 12:22 PM

కల్కి 2898 ఏడి తర్వాత నాగ్ అశ్విన్ చేసేది ఆ మూవీ సిక్వెల్ ఏ అని అంతా అనుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు కాబట్టి అందుకే ఇప్పటివరకు దీనికి సంబంధించిన అప్డేట్ ఏమి రాలేదని అంతా అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ లైన్ అప్ చూస్తుంటే సినిమా ఇంకా ఆలస్యం అయ్యేలానే కనిపిస్తుంది.

కల్కి 2898 ఏడి తర్వాత నాగ్ అశ్విన్ చేసేది ఆ మూవీ సిక్వెల్ ఏ అని అంతా అనుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు కాబట్టి అందుకే ఇప్పటివరకు దీనికి సంబంధించిన అప్డేట్ ఏమి రాలేదని అంతా అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ లైన్ అప్ చూస్తుంటే సినిమా ఇంకా ఆలస్యం అయ్యేలానే కనిపిస్తుంది.

  • Published Aug 26, 2025 | 12:22 PMUpdated Aug 26, 2025 | 12:22 PM
అసలు నాగ్ అశ్విన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ?

కల్కి 2898 ఏడి తర్వాత నాగ్ అశ్విన్ చేసేది ఆ మూవీ సిక్వెల్ ఏ అని అంతా అనుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు కాబట్టి అందుకే ఇప్పటివరకు దీనికి సంబంధించిన అప్డేట్ ఏమి రాలేదని అంతా అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ లైన్ అప్ చూస్తుంటే సినిమా ఇంకా ఆలస్యం అయ్యేలానే కనిపిస్తుంది. అశ్విని దత్ సినిమాను వీలైనంత త్వరగా తీయాలని చూస్తున్నారట కానీ ప్రభాస్ డేట్స్ మాత్రం దొరకడం లేదని టాక్. సో ప్రస్తుతం అంతా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అయితే మరోవైపు నాగ్ అశ్విన్ రీసెంట్ గా రజినీకాంత్ కు ఓ స్టోరీ లైన్ చెప్పాడని.. ఆయన పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన ఏమి లేకపోయినా.. టాక్ మాత్రం స్ట్రాంగ్ గానే వినిపిస్తుంది . కానీ ఇది అంత తేలికగా అయ్యే పని కూడా కాదు. ప్రస్తుతం రజిని కాంత్ కూడా వరుసప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. సో ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఫుల్ ప్లెడ్జెడ్ గా రజినీని ఒప్పించే పనిలో ఉంటాడా లేదా ప్రభాస్ డట్లుకోసం వెయిట్ చేస్తాడా.. అసలు నాగ్ అశ్విన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇంకొంతకాలం సస్పెన్స్ గానే ఉండనుంది.

కల్కి 2 కోసం అయితే డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అటు నాగ్ అశ్విన్ ట్రాక్ రికార్డ్ కూడా పెద్దదేమీ కాదు. తీసిన మూడు సినిమాలతోనే టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. సో ప్రస్తుతం పరుగులు తీయకుండా నాగ్ అశ్విన్ ఏ సినిమా తీసిన కూడా గతంలో వాటిలా ప్రేసెంటబుల్ గా ఉంటే చాలు అనేది కొందరి అభిప్రాయం. కానీ నాగ్ అశ్విన్ నెక్స్ట్ ఏ సినిమా తీసినా కానీ అది కల్కిని మించి ఉండాల్సిందే. లేదంటే ప్రేక్షకులు ఒప్పుకోనే పరిస్థితిలో లేరు. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.