Swetha
తేజ సజ్జ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ మిరాయ్. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 12 న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్.
తేజ సజ్జ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ మిరాయ్. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 12 న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్.
Swetha
తేజ సజ్జ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ మిరాయ్. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 12 న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసినందుకు దానికి తగిన ప్రామిసింగ్ కంటెంట్ తో ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఏకంగా మూడు నిమిషాల కంటెంట్ తో అందరిని వేరే ప్రపంచానికి తీసుకుని వెళ్లారు.
ట్రైలర్ విషయానికొస్తే.. తేజ సజ్జా సరదాగా తనకు తోచిన పనులు చేస్తూ.. జీవితం గడుపుతూ ఉంటాడు. తానూ ప్రేమించిన అమ్మాయి వలన తన జన్మకు ఓ కారణం ఉందని తెలుసుకుంటాడు. ఇక మంచు మనోజ్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అతను ఓ దుర్మార్గుడు.. అతనిని నాశనం చేసేందుకు ఓ ప్రమాదరకమైన ప్రాంతానికి వెళ్ళడానికి సైతం వెనకడుగు వేయడు తేజ. అలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటు ఉంటాడు. అవన్నీ ఏంటి అసలు మిరాయ్ అంటే ఏంటి.. ఆ 9 గ్రంధాల వెనుక ఉన్న రహస్యం ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇక విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని.. ట్రైలర్ లో శాంపిల్ చూపించేసారు. అలాగే సినిమాలో చాలా మంది సర్ప్రైజ్ క్యామియోలు కూడా ఉన్నాయి. బిజీఎం బావుంది.. మొత్తానికి సినిమ ట్రైలర్ అయితే ఆద్యంతం ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.