Swetha
ప్రతిసారి ఓ స్టార్ హీరో నుంచి హిట్ పడాలంటే అది అసాధ్యమే. ఎందుకంటే రిలీజ్ కు ముందు వరకు హైప్ విపరీతంగా ఉన్నా కూడా.. మొదటి షో పడిన తర్వాత మాత్రం ఈ మధ్య లెక్కలు మారిపోతూ ఉన్నాయి. అందుకు బడా హీరోలు సైతం అతీతం కాదు.
ప్రతిసారి ఓ స్టార్ హీరో నుంచి హిట్ పడాలంటే అది అసాధ్యమే. ఎందుకంటే రిలీజ్ కు ముందు వరకు హైప్ విపరీతంగా ఉన్నా కూడా.. మొదటి షో పడిన తర్వాత మాత్రం ఈ మధ్య లెక్కలు మారిపోతూ ఉన్నాయి. అందుకు బడా హీరోలు సైతం అతీతం కాదు.
Swetha
ప్రతిసారి ఓ స్టార్ హీరో నుంచి హిట్ పడాలంటే అది అసాధ్యమే. ఎందుకంటే రిలీజ్ కు ముందు వరకు హైప్ విపరీతంగా ఉన్నా కూడా.. మొదటి షో పడిన తర్వాత మాత్రం ఈ మధ్య లెక్కలు మారిపోతూ ఉన్నాయి. అందుకు బడా హీరోలు సైతం అతీతం కాదు. ఇక రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు విషయంలో ఏమి జరిగిందో తెలియనిది కాదు. దీనితో ఆ డిస్సపాయింట్మెంట్ నుంచి పవన్ అభిమానులను బయటకు తీసుకొచ్చేందుకు OG విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సినిమా నుంచి వస్తున్నా ఒక్కో అప్డేట్ ప్రేక్షకులకు హై ఫీలింగ్ ఇస్తుందన్నమాట వాస్తవం.
చూడబోతుంటే ఈసారి పవన్ ఇండస్ట్రీ లెక్కలను సరిచేసేలానే కనిపిస్తున్నాడు. 100 కోట్ల షేర్ అనేది చాలా మంది హీరోలకు చాలా ఈజీ అయిపోయింది. కానీ పవన్ కు మాత్రం అది ఇంకా అందలేదు. అయితే ఇప్పుడు ఓజి తో ఈ లెక్కలు సరిచేయడం ఖాయమని ట్రేడ్ పండితుల అంచనా. కాకపోతే పవన్ మాత్రం ఈ కలెక్షన్స్ రికార్డ్స్ ను పెద్దగా పట్టించుకోరన్న మాట తెలియనిది కాదు. ప్రస్తుతం అయితే సినిమా బిజినెస్ డీల్స్ బాగానే జరుగుతున్నాయి. ఒక్క నైజం లోనే ఓజి హక్కులు రూ.60 కోట్లు పలకడం విశేషం. ఆంధ్రా రైట్స్ రూ.75 కోట్లు, రాయలసీమయ హక్కులు రూ.25 కోట్లు వరకు పలికినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక OG ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.