Swetha
ఇన్నేళ్ల తర్వాత అనుష్క నుంచి సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో లీడ్ చేసిన హీరోయిన్స్ లో అనుష్క నేమ్ ముందుంటుంది. కానీ సైజ్ జీరో తర్వాత ఈ అమ్మడు కెరీర్ ఏమైందో తెలియనిది కాదు.
ఇన్నేళ్ల తర్వాత అనుష్క నుంచి సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో లీడ్ చేసిన హీరోయిన్స్ లో అనుష్క నేమ్ ముందుంటుంది. కానీ సైజ్ జీరో తర్వాత ఈ అమ్మడు కెరీర్ ఏమైందో తెలియనిది కాదు.
Swetha
ఇన్నేళ్ల తర్వాత అనుష్క నుంచి సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో లీడ్ చేసిన హీరోయిన్స్ లో అనుష్క నేమ్ ముందుంటుంది. కానీ సైజ్ జీరో తర్వాత ఈ అమ్మడు కెరీర్ ఏమైందో తెలియనిది కాదు. సినిమాల సంగతి అలా ఉంచితే కనీసం సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ , ఇతర ఈవెంట్స్ లో కూడా స్వీటీ దర్శనం కరువైపోయింది. ఆఖరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించింది అయితే రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో కానీ , రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ లో కానీ ఈ అమ్మడు కనిపించలేదు.
ఇక సెప్టెంబర్ 5 ఘాటీ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో కనీసం ఇప్పుడైనా స్వీటీ నుంచి ఇంటర్వూస్ , ప్రమోషన్స్ ఉంటాయేమో అనిన్ అనుష్క ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఈసారి కూడా వీరికి షాక్ తప్పదు. స్వీటీ సినిమాకు సంబందించిన ఎలాంటి ప్రమోషన్స్ లోను ఇన్వాల్వ్ అవ్వడం లేదంట. ఈ విషయం స్వయంగా సినిమా నిర్మాతలలో ఒకరు చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినా సరే అనుష్క రావడం కష్టమేనట. సరే స్వీటీ ఎప్పటిలానే సినిమా ప్రమోషన్స్ కు రావడం జరగడం లేదు. కానీ ఇక్కడ అనుష్క రాకపోవడం వలన ఓ పెద్ద సమస్యే తలెత్తనుంది.
ఈరోజుల్లో ఓ సినిమాకు ప్రమోషన్స్ ఎంత కీలకమో తెలియనిది కాదు. సినిమా నుంచి మెయిన్ క్యాస్ట్ వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటే తప్ప ఇప్పుడు జనాలు థియేటర్స్ కు కదలడం లేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైం లో ప్రమోషన్స్ భారం అంతా నవీన్ పోలిశెట్టి తీసుకున్నాడు. అప్పటికి అతనికంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది కాబట్టి ఎలాగూ ఆడియన్స్ థియేటర్స్ కు పుల్ చేయగలిగాడు. కానీ ఇప్పుడు సినిమాలో హీరో విక్రమ్ ప్రభు. తమిళ హీరో కావడంతో ఇక్కడ చెప్పుకోదగిన క్రేజ్ లేదు. సో ప్రమోషన్స్ కు వచ్చినా రాకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక మిగిలింది క్రిష్ మాత్రమే. ఇక ప్రమోషన్స్ ఎలా కొనసాగుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.