iDreamPost
android-app
ios-app

RRR పులి ఫైట్ అంత స్పెషలా..?

  • Published Jan 27, 2020 | 5:35 AM Updated Updated Jan 27, 2020 | 5:35 AM
  • Published Jan 27, 2020 | 5:35 AMUpdated Jan 27, 2020 | 5:35 AM
RRR  పులి ఫైట్ అంత స్పెషలా..?

టాలీవుడ్ కు లీకుల బెడద ఇప్పటిది కాదు. షూటింగ్ స్పాట్ నుంచి లీకవుతున్న వీడియో బిట్ల నుంచి మొత్తం సినిమానే ఆన్ లైన్ లో పెట్టె దాకా పరిశ్రమ ఎన్నో చూసింది. అత్తారింటికి దారేది. టాక్సీ వాలాలు రిలీజ్ కు ముందే పూర్తి సినిమాలు నెట్ లో ప్రత్యక్షం కావడం ఎవరూ మర్చిపోలేరు. స్పాట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి సైతం బాహుబలి టైంలో వీటి బారిన పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా దానికి మినహాయింపు కావడం లేదు.

గత మూడు రోజులుగా ఆర్ఆర్ఆర్ నుంచి లీకైన పులి ఫైట్ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జక్కన్న టీం అలెర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ వీటిని డిలీట్ చేయించినా పర్సనల్ వాట్స్అప్, ఈ మెయిల్ రూపంలో చక్కర్లు కొడుతూనే ఉందట. దాన్ని చూసిన వాళ్ళ సమాచారం మేరకు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తున్న సన్నివేశం ఉందట. ఒంటి మీద చొక్కా లేకుండా అడవిదొంగ స్టైల్ లో కేవలం చెడ్డి తరహా కాస్ట్యూమ్ తో తారక్ చాలా ఫెరోషియస్ గా ఉన్నట్టు టాక్

ఇది సినిమా మొత్తంలో హై లైట్ అయ్యే ఎపిసోడ్స్ లో ఒకటిగా చెబుతున్నారు. గూడెం మీద పులి దాడి చేసినప్పుడు కొమరం భీమ్ గా నటిస్తున్న తారక్ దాన్ని ధీటుగా ఎదుర్కుని అంతమొందించే సీన్ ఇదట. మరి రామ్ చరణ్ కూడా వస్తాడా లేదా అనే క్లారిటీ మాత్రం అందులో లేదని చెబుతున్నారు. ఏదైతేనేం జూనియర్ అభిమానులు ఈ వార్త పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అసలే ఏ అప్ డేట్ ఇవ్వకుండా ఆర్ఆర్ఆర్ ఆలస్యం చేస్తోందని గుర్రుగా ఉన్న ఫ్యాన్స్ కు లీకు రూపంలోనైనా సరే ఇది కొంత ఊరట కలిగిస్తోందని సమాచారం. ముందు చెప్పిన జూలై 30 తేదికి ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తారా లేదా ఇప్పటికే ప్రచారంలో ఉన్నట్టు దసరాకు వాయిదా వేస్తారా అనే దాని గురించి క్లారిటీ రావాల్సి ఉంది

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş