iDreamPost
android-app
ios-app

విజయ్‌ మిల్టన్‌ ‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌’ టైటిల్‌ టీజర్‌ విడుదల

  • Published Aug 28, 2025 | 4:37 PM Updated Updated Aug 28, 2025 | 4:37 PM

'గోలీసోడా', గోలీసోడా-2 చిత్రాల దర్శకుడు,ప్రముఖ కెమెరామెన్‌ విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో గోలీసోడా ఫ్రాంఛైజీ లో భాగంగా గోలీసోడాలోని స్పిరిట్‌ను.. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడు

'గోలీసోడా', గోలీసోడా-2 చిత్రాల దర్శకుడు,ప్రముఖ కెమెరామెన్‌ విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో గోలీసోడా ఫ్రాంఛైజీ లో భాగంగా గోలీసోడాలోని స్పిరిట్‌ను.. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడు

  • Published Aug 28, 2025 | 4:37 PMUpdated Aug 28, 2025 | 4:37 PM
విజయ్‌ మిల్టన్‌ ‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌’ టైటిల్‌ టీజర్‌ విడుదల

‘గోలీసోడా’, గోలీసోడా-2 చిత్రాల దర్శకుడు,ప్రముఖ కెమెరామెన్‌ విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో గోలీసోడా ఫ్రాంఛైజీ లో భాగంగా గోలీసోడాలోని స్పిరిట్‌ను.. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడు. ఆయన చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సునీల్‌, వేదన్‌, భారత్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

రఫ్‌ నోట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మాణంలో జరుపుకుంటోన్న ఈ చిత్రానికి వినాయక చవితి పర్వదినాన ‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌’గా టైటిల్‌ని ఫిక్స్‌ చేసి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.. ప్రముఖ తమిళ కథానాయకులు విజయ్‌ సేతుపతి, విజయ్‌ ఆంటోని, ఆర్యలతో పాటు మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ తమ ఎక్స్‌ అకౌంట్‌ వేదికగా టైటిల్‌ను ట్విట్‌ చేసి శుభాకాంక్షలు అందజేశారు. దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ ” గోలీసోడాలోని రఫ్‌నెస్‌ను, న్యూ చాప్టర్‌లో ఈ సినిమాలో ఆడియన్స్‌ చూడబోతున్నారు.

ఈ టైటిల్‌ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టీజర్‌తో మా సినిమాపై ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. తప్పకుండా మా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అందరి అంచనాలను అందుకుంటుంది. ఈ సందర్బంగా మా టైటిల్‌ టీజర్‌ను తమ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మమ్ములను సపోర్ట్‌ చేసిన అందరికి ధన్యవాదాలు’ అన్నారు. రాజతరుణ్‌, సునీల్‌, వేదన్‌, భారత్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం శ్యామ్‌ సీఎస్‌, ఫోటోగ్రఫీ విజయ్‌ మిల్టన్‌,ఎడిటర్‌: పాపన్‌ జేఆర్‌, యాక్షన్‌: కలై కింగ్‌సన్‌, విక్రమ్‌ మౌర, రచన-ఫోటోగ్రఫీ-దర్శకత్వం: విజయ్‌ మిల్టన్‌.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom