iDreamPost
android-app
ios-app

జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న OG

  • Published Aug 28, 2025 | 12:28 PM Updated Updated Aug 28, 2025 | 12:28 PM

OG కౌంట్ డౌన్ అప్పుడే మొదలైపోయింది. వరుసగా కిక్ ఇచ్చే అప్డేట్స్ తో OG మేకర్స్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా మీద హైప్ పెంచుతూనే ఉంది. అలాగే ప్రతి అప్డేట్ తో వాయిదా ప్రచారాలకు చెక్ పెడుతూనే ఉంది.

OG కౌంట్ డౌన్ అప్పుడే మొదలైపోయింది. వరుసగా కిక్ ఇచ్చే అప్డేట్స్ తో OG మేకర్స్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా మీద హైప్ పెంచుతూనే ఉంది. అలాగే ప్రతి అప్డేట్ తో వాయిదా ప్రచారాలకు చెక్ పెడుతూనే ఉంది.

  • Published Aug 28, 2025 | 12:28 PMUpdated Aug 28, 2025 | 12:28 PM
జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న OG

OG కౌంట్ డౌన్ అప్పుడే మొదలైపోయింది. వరుసగా కిక్ ఇచ్చే అప్డేట్స్ తో OG మేకర్స్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా మీద హైప్ పెంచుతూనే ఉంది. అలాగే ప్రతి అప్డేట్ తో వాయిదా ప్రచారాలకు చెక్ పెడుతూనే ఉంది. ఇక ఓవర్శిస్ లో అడ్వాన్స్ బుకింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం ఇరవై నాలుగు గంటల నిడివిలో 46 షోల నుంచే 80 వేల డాలర్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డ్ సృష్టించింది OG.

రాబోయే విధ్వంసాన్ని శాంపిల్ గా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో చూపించినట్టు అయింది. ఇక టికెట్స్ సంగతి పక్కన పెడితే మరో వైపు ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. ఓజి పేరుతో స్పెషల్ గా ప్రింట్ చేసిన టీషీర్ట్స్ ,కీ చైన్స్ అన్నీ కూడా వెంటనే సేల్ అయిపోతున్నాయి. ఇక టీ షర్ట్స్ అయితే నిమిషానికి రెండు వేలకు పైగా అమ్ముడుపోవడం గమనార్హం. దీనిని బట్టే ఓజి మ్యానియా ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది.

ఇప్పుడే ఇలా ఉంటె ఇక తెలుగు స్టేట్స్ లో అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెడితే.. అప్పుడు ఓజి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో ఊహించొచ్చు. మొత్తానికి ఓజి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుందన్నమాట వాస్తవం . ప్రస్తుతానికైతే బజ్ బాగానే పెరుగుతుంది. రిలీజ్ టైం కు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. ముందు ముందు ఓజి నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అవి ఇంకే రేంజ్ లో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.