iDreamPost
android-app
ios-app

2004 సంక్రాంతి ఎపిక్ క్లాష్ 2026 లో రిపీట్ అవుతుందా !

  • Published Aug 29, 2025 | 10:15 AM Updated Updated Aug 29, 2025 | 10:15 AM

బాలయ్య అన్స్టాపబుల్ షో లో ఎంతో మంది గెస్ట్స్ ఎన్నో కబుర్లు షేర్ చేసుకుంటూ ఉంటారు. అలానే ఆ మధ్యన డార్లింగ్ ఆ షో కి వెళ్ళినప్పుడు 2004 సంక్రాంతి రిలీజ్ ల సమయంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. ఆ సమయంలో బాలకృష్ణ లక్ష్మి నరసింహ , చిరంజీవి అంజి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి.

బాలయ్య అన్స్టాపబుల్ షో లో ఎంతో మంది గెస్ట్స్ ఎన్నో కబుర్లు షేర్ చేసుకుంటూ ఉంటారు. అలానే ఆ మధ్యన డార్లింగ్ ఆ షో కి వెళ్ళినప్పుడు 2004 సంక్రాంతి రిలీజ్ ల సమయంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. ఆ సమయంలో బాలకృష్ణ లక్ష్మి నరసింహ , చిరంజీవి అంజి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి.

  • Published Aug 29, 2025 | 10:15 AMUpdated Aug 29, 2025 | 10:15 AM
2004 సంక్రాంతి ఎపిక్ క్లాష్ 2026 లో రిపీట్ అవుతుందా !

బాలయ్య అన్స్టాపబుల్ షో లో ఎంతో మంది గెస్ట్స్ ఎన్నో కబుర్లు షేర్ చేసుకుంటూ ఉంటారు. అలానే ఆ మధ్యన డార్లింగ్ ఆ షో కి వెళ్ళినప్పుడు 2004 సంక్రాంతి రిలీజ్ ల సమయంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. ఆ సమయంలో బాలకృష్ణ లక్ష్మి నరసింహ , చిరంజీవి అంజి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. దానితో పాటే ప్రభాస్ వర్షం సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ రెండు సినిమాల మధ్యలో ఎందుకు.. వర్షం తర్వాత రిలీజ్ చేద్దాం అంటే.. ఎం ఎస్ రాజు వేసేశారని డార్లింగ్ చెప్పుకొచ్చారు. దానికి బాలయ్ సరదాగా బదులు చెప్పడం అంతా కూడా షో లో మంచి ఫన్ క్రియేట్ చేసింది.

అయితే ఈ విషయం ఇప్పుడు మరోసారి వెలుగులోకి రాడానికి కారణం ఏంటంటే.. 2004 సంక్రాంతి తర్వాత 2026 సంక్రాంతికి కూడా సేమ్ క్లాష్ రిపీట్ అవ్వబోతుంది. చిరంజీవి అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు’ అనే టైటిల్ తో సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకున్నారు. ఇక రీసెంట్ గా నిర్మాత టిజి విశ్వప్రసాద్ ది రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 9 న ఈ సినిమా రాబోతుంది. సో ఈ రెండు సినిమాలు సంక్రాంతి సీజన్ లో రావడం కన్ఫర్మ్.

ఇక బాలకృష్ణ అఖండ 2 సెప్టెంబర్ 25 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంత వరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే సినిమా పోస్ట్ పోన్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో అఫీషియల్ గా సినిమా వాయిదా పడినట్టే. అయితే సినిమాకు సంబందించిన కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ దాదాపు ఈ సినిమాను కూడా సంక్రాంతి సీజన్ కే దింపుదాం అని భావిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఒకవేళ ఇదే జరిగితే బాలయ్య , చిరు , ప్రభాస్ లు పండక్కి సందడి చేయడానికి వస్తున్నట్లే . ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.