Swetha
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ , మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ వార్ 2. తారక్ స్ట్రెయిట్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ కావడంతో.. సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు తారక్ అభిమానులు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ కూడా సినిమా గురించి అంతే హైప్ క్రియేట్ చేశాడు

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ , మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటించిన మూవీ వార్ 2. తారక్ స్ట్రెయిట్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ కావడంతో.. సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు తారక్ అభిమానులు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ కూడా సినిమా గురించి అంతే హైప్ క్రియేట్ చేశాడు. కానీ కోటి ఆశలు పెట్టుకుని థియేటర్స్ వరకు వెళ్లిన ప్రేక్షకులను మాత్రం సినిమా సంతృప్తి పరచలేకపోయింది. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ ఓ వార్తా వినిపిస్తుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.
వార్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 14 రిలీజ్ అయినా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 350కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మూవీ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. దీనితో ఇప్పుడు సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇక ఓటిటి లో మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.