iDreamPost
android-app
ios-app

రాజమౌళి నుంచి మరో బాహుబలి.. త్వరలోనే ట్రైలర్ రిలీజ్

  • Published Apr 30, 2024 | 9:49 PM Updated Updated Apr 30, 2024 | 9:49 PM

ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన బాహుబలికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే మరో బాహుబలి వస్తుందని కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన బాహుబలికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే మరో బాహుబలి వస్తుందని కీలక ప్రకటన చేశారు.

  • Published Apr 30, 2024 | 9:49 PMUpdated Apr 30, 2024 | 9:49 PM
రాజమౌళి నుంచి మరో బాహుబలి.. త్వరలోనే ట్రైలర్ రిలీజ్

రాజమౌళి నుంచి సినిమా అప్డేట్ వస్తుందంటే టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు దేశం మొత్తం ఎదురుచూస్తుంటుంది. అంతలా ఆయన తన సినిమాలతో భారతీయ సినీ ఇండస్ట్రీ మీద ఒక చెరగని ముద్ర వేశారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన జక్కన్న.. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ తో మన ముందుకు వచ్చారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రామకృష్ణ, నాజర్, సత్యరాజ్ వంటి స్టార్స్ నటించిన బాహుబలి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమా క్రియేట్ చేసిన వండర్స్, రికార్డులు అంతా ఇంతా కాదు. బాహుబలి వన్ వచ్చింది. హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 దాన్ని మించిన హిట్ కొట్టింది.

ఆ తర్వాత మళ్ళీ బాహుబలి 3 వస్తుందేమో అన్న ఆశ అయితే చాలా మందిలో ఉంది. బాహుబలి పార్ట్ 3 కూడా వస్తే బాగుంటుందని చాలా మంది భావించారు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ పార్ట్ 3 కూడా ఉంటుందని అన్నారు. అయితే తాజాగా జక్కన్న బాహుబలికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని వదిలారు. దానికి సంబంధించిన వీడియోని కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మాహిష్మతి సామ్రాజ్య ప్రజలు అతని పేరుని జపిస్తుంటే.. అతని రాకను ఈ విశ్వంలో ఏ శక్తీ ఆపలేదంటూ రాసుకొచ్చారు. దాని కింద ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్, యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతుంది అంటూ వెల్లడించారు. రాజమౌళి ఇలా ప్రకటన చేశారో లేదో క్షణాల్లో వైరల్ అయిపోయింది. బాహుబలి సినిమాని వివిధ రూపాల్లో తీసుకొస్తామని గతంలోనే రాజమౌళి ప్రకటించారు. మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికర అంశాలతో కూడిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ పుస్తకం కూడా పాఠకులను అలరించింది.

ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ అంటూ రాజమౌళి ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సిరీస్ లో బాహుబలి, భల్లాలదేవ, దేవసేన, శివగామి, బిజ్జలదేవ, కట్టప్ప పాత్రలు ఉంటాయా? లేక ఆ పాత్రలకు కొనసాగింపుగా కొత్త క్యారెక్టర్స్ ఉంటాయా? అనేది తెలియాలంటే ట్రైలర్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని జక్కన్న చెప్పకనే చెప్పారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. మరి రాజమౌళి నుంచి బాహుబలి యానిమేటెడ్ సిరీస్ వస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom