iDreamPost
android-app
ios-app

స్పిరిట్ సినిమాలో సూపర్ ట్విస్ట్.. ?

  • Published Aug 28, 2025 | 11:51 AM Updated Updated Aug 28, 2025 | 11:51 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా వస్తున్న సంగతి. ఇప్పటికే డార్లింగ్ రాజాసాబ్ , ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ ఈ రెండు సినిమాలు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడు ప్రభాస్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా వస్తున్న సంగతి. ఇప్పటికే డార్లింగ్ రాజాసాబ్ , ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ ఈ రెండు సినిమాలు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడు ప్రభాస్.

  • Published Aug 28, 2025 | 11:51 AMUpdated Aug 28, 2025 | 11:51 AM
స్పిరిట్ సినిమాలో సూపర్ ట్విస్ట్.. ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా వస్తున్న సంగతి. ఇప్పటికే డార్లింగ్ రాజాసాబ్ , ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ ఈ రెండు సినిమాలు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడు ప్రభాస్. ఇక ఆ తర్వాత పట్టాలెక్కబోయేది స్పిరిట్ సినిమానే అని టాక్. ఇప్పటికే అడపా దడపా సినిమా నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని అంటున్నారు.

వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెక్కర్లు కొడుతోంది. సందీప్ రెడ్డి వంగ తన సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో తెలియనిది కాదు. రెండు మూడు సినిమాలతోనే తన మేకింగ్ తో అందరిని కట్టిపడేసాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యామియో ఉంటుందని నెట్టింట గట్టిగ వినిపిస్తున్న మాట.

సందీప్ రెడ్డి సినిమాలలో క్యామియోలకు చాలా క్రేజ్ ఉంటుంది. అలాంటిది తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసమే ఎలాంటి పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేసి ఉంటాడో ఊహించొచ్చు. అయితే ప్రస్తుతం చిరు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నాడు. మరి చిరు ఈ క్యామియోకి ఒప్పుకుంటాడా లేదా.. అసలు దీనిలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.