iDreamPost
android-app
ios-app

ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికే : అఫీషియల్

  • Published Feb 05, 2020 | 12:44 PM Updated Updated Feb 05, 2020 | 12:44 PM
ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికే : అఫీషియల్

కొద్దిరోజుల క్రితం ఐడ్రీమ్ అందించిన కథనం నిజమయ్యింది. రాజమౌళి ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ వచ్చే 2021 సంక్రాంతికి వాయిదా వేస్తూ జనవరి 8 రిలీజ్ డేట్ ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అన్ని అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లోనూ ఇదే ట్రెండింగ్ అవుతోంది. షూటింగ్ అనుకున్న టైంకి పూర్తి కాకపోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం అవసరం పడుతుంది కాబట్టి హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ చేయడం కంటే ఇదే మంచి నిర్ణయమని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఫస్ట్ టైం కాంబినేషన్ కావడంతో ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ పరంగానూ క్రేజ్ విపరీతంగా ఉంది.

అజయ్ దేవగన్ ఇటీవలే సెట్స్ లో జాయినైపోగా ఇంకా హీరోయిన్ అలియా భట్ ఎంటర్ కావాల్సి ఉంది. కొన్ని ఫోటోలు వీడియోలు లీకులు రూపంలో బయటికి వచ్చినప్పటికీ టీమ్ వెంటనే అలెర్ట్ అయిపోయి వాటిని సోషల్ మీడియా నుంచి తీసేయడంతో డ్యామేజ్ చాలామటుకు తగ్గిపోయింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చేసింది కాబట్టి రామ్ చరణ్ కు 2 ఏళ్ల గ్యాప్ తారక్ కు రెండున్నరేళ్ల గ్యాప్ వచ్చేసినట్టే.

బాహుబలి లాగా కాకుండా వేగంగా పూర్తి చేసి జూలైలొనే రిలీజ్ చేస్తామని జక్కన్న ఇచ్చిన మాట ఊహించినట్టుగానే తప్పేశారు. మొదట్లో ఇద్దరు హీరోలకు విడివిడిగా గాయాలు కావడం కూడా కొంత ప్రభావం చూపించింది. టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ కోసం అభిమానులు ఇంకో సంవత్సరం పాటు ఎదురు చూడటం తప్ప ఇంకేమి చేయలేని పరిస్థితి.రాజమౌళి సినిమా అంటే అంతే మరి. ఆ మాత్రం ఎదురుచూపులు తప్పవు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్ఆర్ఆర్ కు సాయి మాధవ్ బుర్ర సంభాషణలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి