iDreamPost
android-app
ios-app

విక్రమార్కుడు మూవీ ఐటెం సాంగ్‌లో నటించిన ఈ నటి గుర్తుందా..? ఇప్పుడు వేరే లెవల్

  • Published Aug 21, 2024 | 12:05 PM Updated Updated Aug 21, 2024 | 12:05 PM

టాలీవుడ్ జక్కన్న- మాస్ మహారాజా రవితేజ కాంబోలో వచ్చిన చిత్రం విక్రమార్కుడు. ఇందులో ఐటెం సాంగ్‌లో నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..? ఇప్పటికే అంతే అందంతో మెస్మరైజ్ చేస్తుంది. ఇప్పుడు ఆమె లెవలే వేరు..

టాలీవుడ్ జక్కన్న- మాస్ మహారాజా రవితేజ కాంబోలో వచ్చిన చిత్రం విక్రమార్కుడు. ఇందులో ఐటెం సాంగ్‌లో నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..? ఇప్పటికే అంతే అందంతో మెస్మరైజ్ చేస్తుంది. ఇప్పుడు ఆమె లెవలే వేరు..

  • Published Aug 21, 2024 | 12:05 PMUpdated Aug 21, 2024 | 12:05 PM
విక్రమార్కుడు మూవీ ఐటెం సాంగ్‌లో నటించిన ఈ నటి గుర్తుందా..? ఇప్పుడు వేరే లెవల్

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు, టాలీవుడ్‌కి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన డైరెక్టర్ రాజమౌళి. సెల్యూలాయిడ్‌పై అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాడు. వాటిల్లో ఒకటి మాస్ మహారాజ్ రవితేజ-అనుష్క శెట్టి జంటగా నటించిన విక్రమార్కుడు. 2006లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ పోషించిన సంగతి విదితమే. అత్తిలి సత్తిబాబుగా అల్లరి చిల్లరి దొంగగా, విక్రమ్ రాథోడ్‌గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా డిఫరెంట్ రోల్స్ చేసి మెప్పించాడు. విక్రమార్కుడు అనగానే ముందుగా జింతకా జిత జిత అనే మ్యానరిజం గుర్తుకురావడం ఖాయం. అలాగే విక్రమ్ రాథోడ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ మర్చిపోలేం. అనుష్క, రుతిక అందాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. భావుజీగా వినీత్ కుమార్, టిట్లాగా అజయ్ ఫెర్మామెన్స్ సూపర్ అని చెప్పాలి. కథ, కథనాలే కాదు బీజీఎం, సాంగ్స్ కూడా ఈ సినిమాకు హైలెట్. విక్రమార్కుడు మూవీలో కాలేజీ పాపల బస్సు నుండి జోలాలి సాంగ్స్ వరకు మెప్పించాయి.

ఇక రాజమౌళి అంటే స్పెషల్ సాంగ్స్‌కు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. విక్రమార్కుడు మూవీలో కూడా వస్తావా వస్తావా.. ఒక్కసారి వస్తావా సాగిపోయే ఐటమ్ సాంగ్ ఉంది. ఇందులో డ్యాన్స్ చేసిన నటి గుర్తుందా..? తన ఒంపుసొంపులతో పాటకు హైలెట్‌గా నిలుస్తుంది. ఈ నటి మన తెలుగమ్మాయే. ఆమె పేరు మేఘనా నాయుడు. విజయవాడలో పుట్టిన మేఘనా నాయుడు.. తండ్రి ఎతిరాజ్ ఎయిర్ ఇండియాలో పనిచేయడంతో మహారాష్ట్రలో పెరిగారు. ఆమె విద్యాభ్యాసం ముంబయిలో కొనసాగింది. భరత నాట్యంలో ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకుంది. అంతే కాకుండా తండ్రి టెన్నిస్ కోచ్ కావడంతో అందులో కూడా ప్రావీణ్యం సంపాదించింది. 18 సంవత్సరాల వయస్సులో చెన్నైలోని బంధువు వివాహానకిి వెళ్లినప్పుడు.. అనుకోకుండా స్క్రీన్ టెస్‌కు వెళ్లి.. ప్రేమ సాక్షి అనే తెలుగు మూవీకి సెలెక్ట్ అయ్యింది. శ్రీహరి హీరోగా నటించిన పృధ్వీ నారాయణ, వెండి మబ్బులు వంటి చిత్రాల్లో నటించింది.

Meghna Naidu vikramarkudu

కన్నడ, హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించింది ఈ తెలుగమ్మాయి. కొన్ని సినిమాల్లో బోల్డ్‌గా నటించి మెప్పించి, సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. తెలుగులో శత్రువు, భామా కలాపం చిత్రాలతో పాటు విక్రమార్కుడులో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. ఇక అక్కడ నుండి ప్రత్యేకమైన సాంగ్స్‌లో కనిపించడం స్టార్ట్ చేసింది. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీలో చెలి చెమకు కనులు వల వేసేనులే తొలిగా తొలిగా సాంగ్‌లో వెంకటేశ్ సరసన కనిపించింది. పాండురంగడు, 100% లవ్, పిల్ల జమీందార్ చిత్రాల్లో కూడా ఇదే తరహాలో మెస్మరైజ్ చేసింది. ఇక అక్కడ నుండి ఆమె కనిపించలేదు. కానీ హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అప్పుడప్పుడు మెరుస్తుంది. 2011 నుండి టెన్నీస్ ప్లేయర్ లూయిస్ మిగ్యుల్ రీస్ తో డేటింగ్ లో ఉన్న ఆమె… 2016లో అతడితో ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఆమె దుబాయ్‌లో ఉంటుంది. ఆఫర్స్ వచ్చినప్పుడు ఇండియా వచ్చి వెళుతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు అప్ డేట్ లో ఉంటోంది. ఇప్పటికీ అంతే అందంతో అడ్మైర్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Meghna Naidu Reis (@meghnanaidu1)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabet