iDreamPost
android-app
ios-app

తారక్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్

  • Published Feb 11, 2020 | 5:45 AM Updated Updated Feb 11, 2020 | 5:45 AM
  • Published Feb 11, 2020 | 5:45 AMUpdated Feb 11, 2020 | 5:45 AM
తారక్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్

ఏ హీరోకైనా బ్లాక్ బస్టర్స్ అనేవి చాలా స్పెషల్ మూమెంట్స్ గా నిలిచిపోతాయి. వాటి తాలుకు జ్ఞాపకాలు, రికార్డులు, పోటీ సినిమాలు తదితరాలు ఎప్పటికప్పుడు గుర్తుకువస్తూ ఉంటాయి. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ప్రత్యేకించి వేరే చెప్పాలా. అసలే తమ కథానాయకుడు రెండేళ్ళు తెరకు దూరమైపోతున్నాడని ఫ్యాన్స్ ఎంత కలవరపడుతున్నారో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కోసం అనుకున్న టైం కన్నా ఎక్కువే త్యాగం చేస్తున్న తారక్ ని రాజమౌళి ఇలా లాక్ చేయడం పట్ల కొంత అసంతృప్తి నెలకొన్నా బాహుబలి రేంజ్ ని మించే మూవీ అన్న నమ్మకంతో ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

వాళ్లకు కొంత ఊరట కలిగించే ప్రయత్నం ఈ వారం అంటే ఫిబ్రవరి 13న చేయనున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన టెంపర్ స్పెషల్ స్క్రీనింగ్ ని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో అభిమానుల కోసం వేయబోతున్నారు.

పూరి కెరీర్ కాస్త డౌన్ లో ఉన్నప్పుడు ఇది ఎలా ఉంటుందో అన్న అనుమానాల మధ్య రిలీజైన టెంపర్ ఏకంగా అంచనాలు దాటేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేసింది. హీరో పాత్రను లంచగొండి పోలీస్ ఆఫీసర్ గా చూపడం అనే పాయింట్ ని డిఫరెంట్ గా టాకిల్ చేసిన పూరి మేకింగ్ కి ప్రేక్షకుల మెప్పుతో పాటు భారీ వసూళ్లు దక్కాయి.

డ్రై మంత్ గా చెప్పుకునే ఫిబ్రవరిలోనూ టెంపర్ రన్ ని చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఎన్టీఆర్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్, పోసాని పాత్ర, మణిశర్మ అద్భుతమైన నేపధ్య సంగీతం, మహిళలపై లైంగిక వేధింపుల కాన్సెప్ట్ వెరసి టెంపర్ ని వెరీ వెరీ స్పెషల్ మూవీగా నిలిపాయి. ఇంతకాలం తర్వాత పెద్ద స్క్రీన్ మీద లేటెస్ట్ సౌండ్ సిస్టంతో మరోసారి టెంపర్ ని చూపిస్తే జూనియర్ ఫ్యాన్స్ కు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఆ మధ్య ఎఎంబి సినిమాస్ లో దూకుడుని ప్రదర్శిస్తే హౌస్ ఫుల్ అయిపోయి అభిమానుల హుషారుతో నిండిపోయింది. ఇప్పుడు టెంపర్ కూడా దానికి ధీటైన రెస్పాన్స్ తెచ్చుకుంటుందనే విషయంలో ఎవరికి సందేహాలు లేవు.

Jojobet Girişjojobet güncel girişMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet