iDreamPost
android-app
ios-app

సచిన్ ను మెప్పించిన 3BHK

  • Published Aug 26, 2025 | 11:06 AM Updated Updated Aug 26, 2025 | 11:06 AM

గత నెలలో థియేటర్స్ లో వచ్చిన ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ 3BHK. మినిమమ్ ప్రామిసింగ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా అనుకున్నట్టుగానే థియేటర్స్ లో పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఓటిటిల నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. ఇంకా దక్కించుకుంటుంది కూడా.

గత నెలలో థియేటర్స్ లో వచ్చిన ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ 3BHK. మినిమమ్ ప్రామిసింగ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా అనుకున్నట్టుగానే థియేటర్స్ లో పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఓటిటిల నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. ఇంకా దక్కించుకుంటుంది కూడా.

  • Published Aug 26, 2025 | 11:06 AMUpdated Aug 26, 2025 | 11:06 AM
సచిన్ ను మెప్పించిన 3BHK

గత నెలలో థియేటర్స్ లో వచ్చిన ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ 3BHK. మినిమమ్ ప్రామిసింగ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా అనుకున్నట్టుగానే థియేటర్స్ లో పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఓటిటిల నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. ఇంకా దక్కించుకుంటుంది కూడా. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు వచ్చి చాలా కాలం అయింది కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఓటు వేస్తున్నారు. అందులోను ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇల్లు కట్టుకోవడం అనేది జీవితకాలపు చిరకాల కోరిక. దానిని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు.

అందుకే చాలా మంది మధ్య తరగతి కుటుంబాలు ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా టాపిక్ మరోసారి ఎందుకు వచ్చింది అనే విషయానికొస్తే.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. సచిన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయనకు ఎప్పుడైనా ఖాళీ సమయంలో సినిమాను చూస్తారా అనే ప్రశ్న ఎదురైంది. అందుకే సచిన్ ఇటీవ‌ల 3 బీహెచ్‌కే , అతా తంబైచ నాయ్ సినిమాలు చూశానని తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చాడు.

ఇక అంతే ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. సాధారణంగా ఇలా ఓ స్టార్ సెలెబ్రిటీ ఇలాంటి సినిమాల గురించి రివ్యూస్ ఇవ్వడం లేదా స్పెషల్ గా పోస్ట్ చేయడం లాంటివి చేస్తే.. ఇక ఆ తర్వాత నుంచి ఆయా సినిమాలకు ఇంకాస్త బజ్ పెరిగిపోతుంది. సో ఈ కారణంగా 3 BHK మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. మొత్తానికి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ క్రికెట్ గాడ్ ను సైతం ఇంప్రెస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే ఓ లుక్ వేసేయండి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.