iDreamPost
android-app
ios-app

15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం.. హాలీవుడ్ ఆఫర్స్‌ని సైతం లెక్కచేయని రాజమౌళి..

  • Published May 02, 2024 | 9:44 PM Updated Updated May 02, 2024 | 9:44 PM

15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం రాజమౌళి హాలీవుడ్ మూవీస్ డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చినా గానీ ఒక వ్యక్తి కోసం వదులుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎందుకో తెలుసా?

15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం రాజమౌళి హాలీవుడ్ మూవీస్ డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చినా గానీ ఒక వ్యక్తి కోసం వదులుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎందుకో తెలుసా?

  • Published May 02, 2024 | 9:44 PMUpdated May 02, 2024 | 9:44 PM
15 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం.. హాలీవుడ్ ఆఫర్స్‌ని సైతం లెక్కచేయని రాజమౌళి..

ఎస్ఎస్ రాజమౌళి.. ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. మగధీర సినిమాతో మెస్మరైజ్ చేసి.. ఈగతో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రశంసలు అందుకుని.. బాహుబలితో తెలుగు సినిమా స్థాయి పెంచేసి.. ఆర్ఆర్ఆర్ తో తెలుగోళ్లు అందరూ కాలర్ ఎగరేసుకునేలా చేసిన రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్స్ రాకుండా ఎలా ఉంటాయి. కానీ ఇచ్చిన మాట కోసం రాజమౌళి హాలీవుడ్ ఆఫర్స్ ని సైతం వదులుకున్నారట. లేదంటే ఇప్పుడు జక్కన్న వేరే స్థాయిలో ఉండేవారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత వెల్లడించారు.

హీరోలే కాకుండా నిర్మాతలు సైతం జక్కన్న ఇంటికి క్యూ కడతారు. అంతటి నమ్మకాన్ని ఆయన చాలా తక్కువ సమయంలోనే తెచ్చుకున్నారు. జక్కన్న అడగాలే గానీ బాలీవుడ్, హాలీవుడ్ నిర్మాణ సంస్థలు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఆయన మాత్రం తెలుగు నిర్మాతలతోనే సినిమాలు చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. కెరీర్ తొలినాళ్లలో తనతో ఎవరెవరైతే సినిమాలు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారో వారికి అవకాశం ఇస్తూ వస్తున్నారు రాజమౌళి. తాజాగా మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కూడా ఒకప్పుడు సదరు నిర్మాతకు ఇచ్చిన మాట కోసమే చేస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని నిర్మించే అవకాశం ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణకు అప్పగించారు రాజమౌళి.

అయితే ఈయనతో సినిమా చేస్తానని రాజమౌళి 15 ఏళ్ల క్రితమే మాట ఇచ్చారు. ఆ విషయాన్ని నారాయణ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా 15 ఏళ్ల క్రితమే చేయాలని అనుకున్నామని.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాని నిర్మించాల్సి ఉందని.. కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్ అవ్వలేదని అన్నారు. కానీ మీతో ఖచ్చితంగా సినిమా చేస్తానని రాజమౌళి మాట ఇచ్చారని నిర్మాత అన్నారు. అయితే ఇప్పుడు ఇటు మహేష్ బాబు క్రేజ్, అటు రాజమౌళి ఇమేజ్ పెరిగిపోయాయని.. వీరితో సినిమాలు చేయడానికి ఎంతోమంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారని.. కానీ ఇచ్చిన మాట కోసం తనకు అవకాశం ఇచ్చారని అన్నారు.

తాను చెప్పకపోయినా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నామని వాళ్ళే ప్రకటించారని.. అందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు. రాజమౌళికి హాలీవుడ్ ఆఫర్లు వచ్చినా గానీ వాటిని రిజెక్ట్ చేసి తనతో సినిమా చేస్తున్నారని.. అందుకు సంతోషంగా ఉంది అని కెఎల్ నారాయణ వెల్లడించారు. ఇక మహేష్, రాజమౌళి మూవీ గురించి మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో షూటింగ్ మొదలవుతుందని అన్నారు. అయితే ఇంకా బడ్జెట్ ఎంత అనేది నిర్ణయించలేదని.. కానీ రాజమౌళి, మహేష్ కాంబో కోసం ఎంత పెట్టుబడి పెట్టడానికైనా తాను సిద్ధమే అని అన్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabet