రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనమని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బుధవారం పోర్టు శంకుస్థాపన తర్వాత నిర్వాసితులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. రామాయపట్నం పోర్టు రావడంతో, ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. పోర్టుతో చుట్టుప్రక్కల ఆర్ధికాభివృద్ధి జరుగుతుందన్న భరోసానిచ్చారు సీఎం జగన్. ఇప్పటివరకు మనకు కేవలం 6 పోర్టులుంటే, మరో 4 పోర్టులను […]
ఈత సరదా నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ఆరుగురిలో.. నలుగురు చనిపోగా.. మరో ఇద్దరు గ్రామస్తుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన చింతల కౌషిక్ (16), మద్దినేని సుబ్రహ్మణ్యం (16), మద్దినేని చందనశ్రీ (16), చీమకుర్తి మండలం బూసరపల్లికి చెందిన మున్నంగి శివాజీ (12), మున్నంగి చందన (14), దర్శి మండలం బసవన్నపాలెంకు చెందిన అబ్బూరి హరి […]
ప్రకాశం జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ కు చెందిన వివిధ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ల్యాబ్ అటెండెంట్ 2 , కౌన్సెలర్ 1 , ఆడియో మెట్రిషియన్ 1, బయోమెడికల్ ఇంజినీర్ 2 , ప్లంబర్ 3, ఎలక్ట్రిషియన్ 2, రేడియో గ్రాఫర్ 1 పోస్టు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి […]
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియతో రాజకీయాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఏ జిల్లాలో ఎవరికి పట్టు పెరుగుతుందో, ఎవరి ప్రాభవం మరింత తగ్గుతుందో తెలియజేస్తున్నాయి. ఎన్నికలలో పార్టీ గుర్తులు లేకపోయినా, వ్యక్తులు మాత్రం పార్టీ ముద్రతోనే ముందుకు సాగుతున్నారు. 2,723 పంచాయతీల్లో తొలి దశ ఎన్నికలు జరగగా.. 525 చోట్ల ఏకగ్రీవం కావడం తెలిసిందే. వారిలో 518 మంది వైసీపీ మద్దతుదారులే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు కొనసాగాయి. ఏకగ్రీవాల్లో […]
కరోనా వైరస్ కట్టడిలో అధికారుల నిర్లక్ష్యం భారీ నష్టానికి దారి తీసింది. భారీ సంఖ్యలో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 27 వేల కరోన పరీక్ష నమూనాలు వృథా అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇటీవల అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను సిబ్బంది సరైన విధంగా భద్రపరచకపోవడంతో నష్టం వాటిల్లింది. సాంపిల్స్ తీసిన సిబ్బంది వాటికి సరిగా మూతలు పెట్టకపోవడం, శాంపిల్స్పై నంబర్ వేయకపోవడం వల్ల 27వేల […]
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తెలిపేందుకంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరంభించాలనుకున్న ప్రజా చైతన్య బస్సు యాత్ర లేనట్టేనా..? చంద్రబాబు తన బస్సు యాత్రను విరమించుకున్నట్లేనా..? అంటే విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 45 రోజుల పాటు ఈ బస్సు యాత్ర చేపట్టాలని చంద్రబాబు భావించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం వల్ల బస్సు యాత్రకు ఆదిలోనే ముగింపు పలికారని పరిశీలకులు చెబుతున్నారు. […]
ఒంగోలు జిల్లా చట్టం -1970 కింద 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు.అనంతరం 1972 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లా పేరు ప్రకాశం జిల్లాగా మారింది.కర్నూలు జిల్లా నుండి గిద్దలూరు, మార్కాపురం,ఎర్రగొండపాలెం తాలూకాలు నెల్లూరు జిల్లా నుంచి కనిగిరి,కందుకూరు,దర్శి పొదిలి తాలూకాలు,గుంటూరు జిల్లాలోని అద్దంకి, చీరాల,ఒంగోలు తాలూకాలు కలిపి ఒంగోలు జిల్లాగా ఏర్పడింది.అనంతరం జిల్లాకు చెందిన మహనీయుడు ఉమ్మడి మద్రాసులో ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారి మరణాంతరం వారి పేరును ఒంగోలు జిల్లాకు […]
ఈ రోజు శాసనసభ ప్రారంభమవ గానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కార్యక్రమం పై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చెయ్యడంతో సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది. దీనితో విపక్ష సభ్యులను తమ స్థానాల్లోకి పోయి కూర్చోవాలని సభను సజావుగా జరపడానికి సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్ష సభ్యులు స్పీఎకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం […]
నీరు… కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇది ఓ సాధారణ విషయం. కానీ ఆ ప్రాంత ప్రజలకు ఒక అపురూపం. నీళ్లను చూస్తే వారి మనసు ఉప్పొగుతుంది. ఎందుకంటే అక్కడ సాగునీరే కాదు కనీసం సురక్షితమైన తాగునీటికీ కరువే. ఈ ప్రాంతం ఎక్కడో ఏడారి ప్రాంతంలో లేదు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో కరువుకు మారుపేరైన ప్రకాశం జిల్లాలోనే ఉంది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల ప్రజలకు ఇప్పటికీ సాగు నీరే కాదు కనీసం సురక్షిత […]