iDreamPost
android-app
ios-app

ఎంఈవో, స్కూల్ హెచ్ఎం మధ్య ఘర్షణ.. ఒకరిపై మరొకరు కేసులు..!

ఎంఈవో, స్కూల్ హెచ్ఎం మధ్య ఘర్షణ.. ఒకరిపై మరొకరు కేసులు..!

గురువులు అంటే విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పే వారు.  అంతేకాక పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు క్రమ శిక్షణ నేర్పించడం ఉపాధ్యాయుల విధి. అలాంటి వారు ముందు వారు క్రమశిక్షణగా ఉంటూ విధులు నిర్వహించాలి. ఎందరో టీచర్లు నిజాయితీగా, నిబద్ధతో తమ విధులు నిర్వహిస్తూ పిల్లలు, వారి తల్లిదండ్రుల దృష్టిలో మంచి గుర్తింపు పొందుతున్నారు. కానీ కొందరు మాత్రం వీధి రౌడీల్లా గొడవలు పడుతూ.. ఉపాధ్యాయ వృతికే అపకీర్తి తెస్తున్నారు. తాజాగా మండల ఎంఈవో, పాఠశాల హెచ్ఎం అందరి ముందు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీస్ స్టేషన్  ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం చిన్న దోర్నాలలోని ప్రభుత్వ పాఠశాలలో సుధాకర్ రెడ్డి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ మండల విద్యా అధికారి అయినా మస్తాన్ నాయక్ ఆగష్టు 11న  చిన్నదోర్నాలలోని ఆ పాఠశాలకు తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో స్కూల్ హెచ్ఎం సుధాకర్ రెడ్డి  విధుల్లో లేకపోవడంతో షోకాజ్ నోటీసు ఇచ్చారు. అయినా నిర్లక్ష్య ధోరణిని అలంబిస్తుండంతో ఎంఈవో మస్తాన్ నాయక్ వేతనం నిలిపివేశారు.

ఈ క్రమంలోనే  బుధవారం ఎంఈవో మస్తాన్ రామచంద్ర కోట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలనకు వెళ్లారు. ఇదే సమయంలో చిన్నదోర్నాల పాఠశాల హెచ్ఎం సుధాకర్ రెడ్డి అక్కడి చేరుకున్నారు. తన జీతం ఎందుకు నిలిపివేశారని ఎంఈవోతో వాదనకు దిగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటకు మాటా పెరిగింది. చిన్నగొడవ కాస్తా పెద్ద ఘర్షణకు దారి తీసింది.  ఒకరిపై ఒకరు భౌతిక దాడికి దిగినట్లు సమాచారం. అనంతరం తనపై ఎంఈవో దాడి చేయడంతో కాలర్‌బోన్‌ విరిగిందని మార్కాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలానే ఈ ఘటనపై ఎంఈవో మస్తాన్ నాయక్ స్పందించారు.

పాఠశాలకు సక్రమంగా హాజరుకావాలని సదరు ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసులిచ్చామని మస్తాన్ నాయక్ అన్నారు. అయినా  కూడా ఆయనలో మార్పు రాకపోవడంతో నెల జీతం నిలిపి వేశామని చెప్పారు. అంతేకాక తన వద్దకు సుధాకర్‌రెడ్డి వచ్చి కులం పేరుతో దూషించడంతో పాటు దాడికి దిగారని ఎంఈవో తెలిపారు. ఈ విషయంపై తాను దోర్నాల పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆదర్శంగా నిలవాల్సిన గురువులు కొట్లాటకు దిగడం చర్చనీయాంశమైంది. మరి.. ఈ పంతుల్ల ఫైటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.